జర్నీ : టాలీవుడ్ టు బాలీవుడ్

by Shyam |
జర్నీ : టాలీవుడ్ టు బాలీవుడ్
X

పాన్ ఇండియా స్టార్.. ఈ స్టార్ డం కోసం మన స్టార్లందరూ పరుగులు పెడుతున్నారు. ఎవరికి వారు పాన్ ఇండియా స్టార్ అయిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. బాహుబలి సినిమాతో ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి సాహోతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. జక్కన్న తోడు రాగా నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ మాదిరిగానే… ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు పాన్ ఇండియా స్టార్స్ అయిపోతారు అనేది ఫ్యాక్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎలాగూ తన యాడ్స్‌తో నేషనల్ సెలబ్రిటీ అయిపోయాడు కాబట్టి.. తన తర్వాతి చిత్రాన్ని మల్టీ లింగ్వల్‌గా తెరకెక్కించి పాన్ ఇండియా స్టార్ అయిపోదామనే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో గ్యాంగ్ స్టర్‌గా, ప్రొఫెసర్‌గా కనిపించనున్న మహేష్ … ఈ సినిమానే బాలీవుడ్ ఎంట్రీకి కరెక్ట్ అని అనుకున్నాడు. దీంతో ఈ సినిమాను మల్టీ లింగ్వల్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

మరి ఇంతమంది తోటి హీరోలు బాలీవుడ్ బాట పట్టినప్పుడు తనకేం తక్కువ అనే ఆలోచనలో పడ్డాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ అందుకున్న బన్నీ అదే ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ మధ్య హిందీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం … ఫ్యాన్స్ అటెన్షన్ పెంచుకోవడంలో బిజీగా ఉన్నాడు. తెలుగు, మలయాళంలో భారీ ఫాలోయింగ్ ఉన్న బన్నీ అటు తమిళ్ ఇటు హిందీలో ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ పెంచుకుంటే చాలు పాన్ ఇండియా స్టార్‌గా సరైనోడు అనుకుంటారు అనే అభిప్రాయంలో ఉన్నాడు. అందుకే తన సినిమాలన్నింటినీ హిందీ, తమిళ్‌లోకి డబ్ చేస్తూ యూ ట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్నాడు. ఆ ప్రయత్నం కాస్త సక్సెస్ అయింది. దీంతో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాడట బన్నీ. ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయాలని డిసైడ్ అయ్యాడట. గజినీ సినిమాకు సీక్వెల్ తీస్తే యాక్టింగ్ అదుర్స్ అనిపించాడు అనేలా ఉంటుందని బన్నీ ప్లాన్. బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే పాగా వేయాలని అనుకుంటున్న అల్లువారి అబ్బాయి. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేయాలని కోరాట. ఇదే జరిగితే బన్నీ నేషనల్ లెవల్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. హిందీ హీరోలకు కాంపిటీషన్ అవ్వడం పక్కా అని అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story