Breaking News: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

by srinivas |   ( Updated:2021-05-25 22:41:04.0  )
Breaking News: టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. మూవీ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ తుదిశ్వాస విడిచారు. ఈరోజు తెల్లవారుజూమున విశాఖలోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా కృష్ణకుమార్‌.. సాయిపల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంలో ఆయన మృతి చిత్ర యూనిట్‌‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

Next Story