బిగ్ బాస్ ఎఫెక్ట్‌.. కంటెస్టెంట్లకు టాలీవుడ్ పిలుపు

by Shyam |   ( Updated:2020-12-29 06:05:03.0  )
బిగ్ బాస్ ఎఫెక్ట్‌.. కంటెస్టెంట్లకు టాలీవుడ్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 4’ సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిందో తెలియదు కానీ, కంటెస్టెంట్లకు మాత్రం మంచి లైఫ్‌ను ఇస్తోంది. ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకు సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కుతుండటమే అందుకు నిదర్శనం. టైటిల్ విన్నర్‌తో పాటు మిగతా కంటెస్టెంట్లు కూడా టాలీవుడ్ ఆఫర్లతో సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అభిజిత్, సోహెల్, మెహబూబ్, అవినాష్, దివి, మోనాల్ గజ్జర్ తెలుగు సినిమాల్లో కొత్తగా చాన్స్‌లు కొట్టేసి న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు.

హీరోగా సోహెల్ ప్రయాణం..

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కంటే ఎక్కువ డబ్బును ప్రైజ్ మనీగా కొట్టేసిన సోహెల్.. బిగ్ బాస్‌లో చాలాసార్లు తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి వివరించాడు. తను పదేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నా, సరైన గుర్తింపు రాలేదని చెప్పాడు. కానీ బిగ్ బాస్ తనకు ఆ గుర్తింపు ఇచ్చిందని.. ఇకపై చేసే సినిమాలతో ‘కథ వేరే ఉంటుంది’ అని ధీమా వ్యక్తం చేశాడు. అన్నట్లుగానే సోహెల్ కథ మారిపోయింది. బిగ్ బాస్ ఫైనల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి సైతం తనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తానని హామీ ఇవ్వగా.. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా తన సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలో జార్జి రెడ్డి నిర్మాత అప్పిరెడ్డి తనను హీరోగా పెట్టి సినిమా చేసేందుకు ముందుకు రావడం విశేషం. శ్రీనివాస్ వింజమపటి దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుండగా ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

‘ఎఫ్3’లో అభిజిత్ కీలకం

కింగ్ నాగ్ హోస్ట్ చేసిన బిగ్ బిస్ ‘సీజన్ 4’ విన్నర్‌ అయిన అభిజిత్ మరోసారి సినీ ఇండస్ట్రీలో బిజీ అయిపోతున్నాడని అనిపిస్తోంది. టాలీవుడ్‌లో తనకు నేనున్నానని ఇప్పటికే నాగబాబు హామీ ఇవ్వగా.. కొత్తగా ఫన్ రైడ్ ‘ఎఫ్ 3’లో సూపర్ చాన్స్ కొట్టేశాడని తెలుస్తోంది. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌లో అవకాశం దక్కించుకున్న అభిజిత్.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మళ్లీ బిజీ అయిపోతాడని అంటున్నారు విశ్లేషకులు. ఈ న్యూస్‌తో అభి ఫ్యాన్స్‌ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కో-స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సపోర్ట్‌తో క్రేజీ హీరోగా మారిపోవాలని కోరుకుంటున్నారు. తనకున్న పేషెన్స్ అలాంటి స్టార్‌‌డమ్‌ను తెచ్చిపెడుతుందని అభిప్రాయపడుతున్నారు.

‘ఆచార్య’లో ఛాన్స్ కొట్టేసిన మెహబూబ్..

బిగ్ బాస్ సీజన్‌4లో డ్యాన్స్‌లు, టాస్క్‌లతో అదరగొట్టేసిన మెహబూబ్ దిల్ సే.. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవడమే కాదు మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో కూడా పడ్డాడు. ఇప్పటికే మెహబూబ్‌కు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేసిన చిరు.. కొత్తగా తన ‘ఆచార్య’ సినిమాలోనూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మంచి గుర్తింపునిచ్చే పాత్ర ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త విన్న ఫ్యాన్స్.. ఇది మెహబూబ్‌కు లైఫ్ చేంజింగ్ మూమెంట్ అవుతుందని భావిస్తున్నారు.

‘వేదాలం’ రీమేక్‌లో దివి

దివి.. మోడల్ అయినా సరే, బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చేంత వరకు తన గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. షో రెండో రోజే తన డెసిషన్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న దివి.. చాలా అందంగా కనిపించింది. తను మధ్యలోనే ఇంటి నుంచి వెళ్లిపోయినా, ఉన్నంత కాలం మాత్రం ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేయడంలో సక్సెస్ అయింది. దీంతో ఆటోమేటిక్‌గా చిరు ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలోనూ పడిన దివి.. ఏకంగా చిరు పక్కనే నటించి చాన్స్ కొట్టేసింది. ‘వేదాలం’ రీమేక్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అవినాష్

జబర్దస్త్ కమెడియన్ అవినాష్‌కు కూడా దశ తిరిగేలా ఉంది. తన కామెడీ టైమింగ్‌కు పడిపోయిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాలో చాన్స్ ఇచ్చేసినట్లు సమాచారం. ‘ఎఫ్ 3’లో అవినాష్‌కు మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందని తెలుస్తుండగా.. ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిజీ అయిపోయి, చిరు ఆశీర్వదించినట్లు ఆనాటి కమెడియన్ రాజబాబు అంతటి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

స్పెషల్ సాంగ్‌లో మోనాల్‌..

డైరెక్టర్ కమ్ హోస్ట్ అయిన ఓంకార్ కూడా తను తీయబోయే సినిమాలో మోనాల్ గజ్జర్‌కు మంచి అవకాశం ఇచ్చినట్లు టాక్. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారం కాబోతున్న డ్యాన్స్ ప్లస్ షో జడ్జిగా అవకాశం ఇచ్చిన ఆయన.. మోనాల్‌కు సూపర్ చాన్స్ ఇచ్చేశాడని, ఇంతకు ముందు చేసిన సినిమాలతో స్టార్‌డమ్ తెచ్చుకోలేని మోనాల్.. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో స్టార్ రేంజ్ పొందుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ అల్లుడు అదుర్స్‌లో స్పెషల్ సాంగ్‌ చేయబోతుంది మోనాల్.

Advertisement

Next Story