స్టుపిడ్ కరోనాను ఎగిరి తన్నేశా – పూజా హెగ్డే

by Shyam |   ( Updated:2021-05-06 00:28:37.0  )
Pooja Hegde
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అందాల భామ పూజా హెగ్డే ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చాకా హోమ్ ఐసోలేషన్ కి వెళ్లిన పూజా తాజాగా కరోనా నుండి కోలుకున్నారు.ఈ విషయాన్ని పూజ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. బుధవారం నిర్వహించిన కరోనా పరీక్షలో తనకు నెగెటివ్‌ వచ్చినట్లు పూజాహెగ్డే చెప్పారు. ” నేను కరోనా నుండి కోలుకున్నాను.. ఇదంతా మీ ప్రేమ వలెనే సాధ్యమైంది. ఈ స్టుపిడ్ కరోనాను ఎగిరితన్నా.. కరోనా నెగెటివ్ వచ్చింది. మీ ప్రేమాభిమానాల వలెనే నాకు ఈ కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వచ్చి మ్యాజిక్ జరిగింది. ఎప్పటికి మీకు రుణపడి ఉంటాను. అందరు జాగ్రత్తగా ఉండండి” అంటూ పోస్ట్ చేసింది. ఇక బుట్టబొమ్మకు నెగెటివ్ రావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అమ్మడు టాలీవుడ్ లో ‘రాధే శ్యామ్’,’ ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన కూడా నటించనుంది.

Advertisement

Next Story