- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో నవదీప్ పై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎఫ్ క్లబ్ ఎందుకు మూసేశారో చెప్పాలని ఒత్తిడి
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో జరిగిన లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ప్రముఖులను విచారిస్తోన్న ఈడీ నేడు హీరో నవదీప్ ని విచారించనుంది. కొద్దిసేపటి క్రితమే నవదీప్ విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్ కి వెళ్లారు. ఈ క్రమంలో ఈడీ నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. మనీ లాండిరింగ్, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మొత్తం డ్రగ్స్ కేసులో ఎఫ్ క్లబ్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్, జీషాన్‌లు తరచూ ఎఫ్ క్లబ్ పార్టీలకు హాజరైరయ్యేవారని గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఆ ఎఫ్ క్లబ్ ఓనర్ నవదీప్ కావడంతో అందరి దృష్టి ఒక్కసారిగా నవదీప్ పై మళ్లింది. ఈ క్లబ్ లోనే సినీ ప్రముఖులు పార్టీలకు అటెండ్ అయ్యి డ్రగ్స్ సరఫరా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక్కడే నవదీప్, కెల్విన్ మధ్య లావాదేవీలు జరిగాయని సమాచారం. ఇక డ్రగ్స్ కేసు వెలుగు లోకి రాగానే పబ్ ను ఎందుకు మూసివేశారు అనేదానిపై కూడా నవదీప్ ని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ కెల్విన్‌ను కూడా ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇంకొద్దిసేపటిలో కెల్విన్ కూడా ఈడీ ముందు హాజరుకానున్నాడు.