ఈడీ ముందుకు చార్మీ.. సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయా ?

by Shyam |   ( Updated:2021-09-02 04:55:43.0  )
ఈడీ ముందుకు చార్మీ.. సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయా ?
X

దిశ,వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాదక ద్రవ్యాల(డ్రగ్స్) కేసుకు సంబంధించిన దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) వేగం పెంచింది. గురువారం సినీ నటి, ప్రొడ్యూసర్ చార్మి కౌర్ ఈడీ ఎదుట హాజరయ్యారు. రెండు రోజుల క్రితం పూరి జగన్నాథ్ ను విచారించిన అధికారులు, ఆయన నుంచి కీలక సమాచారాన్ని సేకరించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చార్మి వంతు రావడంతో ఆమె నుంచి ఎలాంటి సమాచారం రానుందో చూడాల్సి ఉంది. పూరీ జ‌గ‌న్నాథ్‌తో క‌లిసి ప‌ని చేస్తున్న చార్మీని ఈడీ అధికారులు డ్రగ్స్‌ కేసులో ప్రశ్నలు సంధించడంతో పాటు బ్యాంక్‌ లావాదేవీల వివరాలపై ఆరా తీయనున్నారు.

ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, చార్మి నిర్మాతలుగా కొన్ని సినిమాలు నిర్మించారు. దీంతో ఇద్దరి బ్యానర్లకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్, చార్మి మధ్య వాట్సాప్ చాటింగ్ పై ఆరాతీయనున్నారు. కెల్విన్ అకౌంట్లో చార్మి డబ్బులు వేసిందా, చార్మి కెల్విన్ అకౌంట్‏కు మనీ ట్రాన్స్‏ఫర్ చేసింది నిజ‌మేనా ? అన్న కోణంలోనూ ఈడీ విచారించనున్నట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ ఇచ్చిన సమాచారంతోనే నటి చార్మీని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చార్మి‌కి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను కూడా సమూలంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story