టాలీవుడ్‌ సినీతారలకు షాక్.. అప్రూవర్‌గా మారిన నిందితుడు

by Anukaran |   ( Updated:2021-09-01 01:58:12.0  )
టాలీవుడ్‌ సినీతారలకు షాక్.. అప్రూవర్‌గా మారిన నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న డ్రగ్స్‌, మనీ లాండరింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు నిందితుడు కెల్విన్ లొంగిపోయాడు. ఎక్సైజ్ అధికారుల కేసు ఆధారంగా 6 నెలల క్రితం ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణలో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు కెల్విన్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఈడీ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కెల్విన్ టాలీవుడ్ సినీతారల భాగోతం బయటపెట్టాడు. దీనికితోడు భారీ మొత్తంలో సినీతారల నుంచి కెల్విన్‌కు నగదు బదిలీ కావడంతో.. అతడి అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు అధికారులు. కెల్విన్ స్టేట్‌మెంట్ ఆధారంగానే సీని ప్రముఖులకు నోటీసులు పంపారు.

భారీ మొత్తంలో నగదు బదిలీ చేసిన సినీతారల బ్యాంక్ అకౌంట్లను కూడా ఈడీ అధికారులు ఫ్రీజ్‌ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు విచారణకు హాజరు అవుతున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ హైదరాబాద్‌లోని ఈడీ అధికారుల ముందు మంగళవారం హాజరవ్వగా.. అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. తాజాగా కెల్విన్ ఈడీ అధికారుల ముందు అప్రూవర్‌గా మారడంతో సదరు సినీ ప్రముఖులు ఇరకాటంలో పడ్డట్టు అయిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story