- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వృద్ధులకు మేలు చేసిన టోల్ ఫ్రీ నంబర్
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న వేళ ప్రజలంతా ఇంటికే పరిమితమయిన విషయం తెలిసిందే. దేశం మొత్తం లాక్‌డౌన్ ఉండటంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈక్రమంలో ఇళ్లలో ఉండే వృద్ధులు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడింది.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టోల్ ఫ్రీ నెంబర్ 14567 కు వృద్ధులు ఫోన్లు చేసి సహాయం పొందారు. అయితే ఇది తెలంగాణలో అందుబాటులోకి తీసుకొచ్చిన నాటి నుంచి కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే అధికంగా ఫోన్ కాల్స్ వచ్చినట్లు ప్రోగ్రామ్ మేనేజర్ తమడపల్లి రాజేష్ చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ అధికంగా ఉన్న ఏప్రిల్-జూన్ నెలల్లో దాదాపు 3454 కాల్స్ వచ్చినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా.. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకున్నారు.
అంతేకాకుండా వ్యాక్సినేషన్ ప్రారంభ సమయంలో కోవిన్ వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం ఎలానో అడిగారని, వారికి పూర్తి ప్రక్రియను వివరించినట్లు తెలిపారు. మరికొందరు వ్యాక్సిన్, కొవిడ్ టెస్ట్ సర్టిఫికేట్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలని, దగ్గరలో ఉన్న పీహెచ్‌సీని చెప్పడం, వ్యాక్సిన్ కేంద్రం సమాచారం వంటి వాటిని తెలుసుకునేందుకే అధికంగా ఫోన్ చేసినట్లు తెలిపారు.