- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tokyo Olympics : భారత అథ్లెట్లకు త్వరలో వ్యాక్సినేషన్
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లనున్న భారత అథ్లెట్లు(Indian athletes), కోచ్‌లు, మ్యాచ్ అఫిషియల్స్ అందరికీ త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) గురువారం ప్రకటించింది. భారత ఆటగాళ్లందరూ టోక్యో వెళ్లేలోపే రెండు డోసులు కూడా పూర్తి చేయనున్నట్లు ఐవోఏ స్పష్టం చేసింది. జాతీయ క్రీడా సమాఖ్యలు అన్నీ వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న క్రీడాకారులు, అధికారుల వివరాలు వెంటనే పంపించాలని ఐవోఏ ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిట్ (ఐవోసీ) అథ్లెట్లు అందరికీ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయలేదని.. అయితే క్రీడాకారుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. మరోవైపు వ్యాక్సినేషన్ నిబంధన తప్పనిసరి కాకపోయినా ఒలింపిక్స్‌కు వచ్చే ఆటగాళ్లలో 80 శాతం మంది టీకా తీసుకొని వస్తారని ఐవోసీ తెలిపింది.