మళ్లీ పెరిగిన పసిడి ధరలు

by Anukaran |
మళ్లీ పెరిగిన పసిడి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : తగ్గినట్టే తగ్గి మురిపించిన పసిడి ధరలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దేశంలో గత మూడు రోజులుగా పసిడి ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. గత మూడు రోజులుగా బంగారం తగ్గడంతో చాలా మంది వివాహాది శుభకార్యాలకు బంగారం కొనడానికి ఇదే మంచి సమయం అనుకున్నారు. కానీ మంగళవారం పసిడి ధర కాస్త పెరగడం ప్రజల్లో కొంత వరకి ఆందోళన కలిగిస్తొదని చెప్పవచ్చు. గత మూడు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉండటంతో పాటుగా, దేశీయంగా కూడా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

అయితే మంగళవారం రోజున బంగారం ధర కొంత మేర పెరిగిందనే చెప్పవచ్చు. పెరిగిన ధరల ప్రకారం హైదరబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 పెరిగి రూ. 43,050కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ. 46, 970కి చేరింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడ ఈరోజు భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ.73 ,300కి చేరింది.

Advertisement

Next Story

Most Viewed