సన్ రైజర్స్ vs ఢిల్లీ.. డూ ఆర్ డై మ్యాచ్!

by Shyam |
సన్ రైజర్స్ vs ఢిల్లీ.. డూ ఆర్ డై మ్యాచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Ipl)ముగింపు దశకు చేరుకుంది. ఇన్ని రోజులు పండుగ చేసుకున్న క్రికెట్ అభిమానులకు ప్రస్తుతం టెన్షన్ వాతవరణం నెలకొంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ జట్లు ఇంటిబాట పట్టాయి. ఈసారి ఐపీఎల్ టోర్నీ ఎవరి వశం కానుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎప్పటిలాగే ముంబై జట్టు ఫైనల్ చేరుకోగా, తొలి ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టును చిత్తు చేసి హైదరాబాద్ జట్టు రెండో క్వాలిఫైయర్‌కు ఎంపికైంది.

అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ జట్టుతో వార్నర్ సేన తలపడనుంది.సాయంత్రం 6 గంటలకు షేక్ జాయెద్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 59 మ్యాచ్ జరగనుంది. తొలుత వరుస విజయాలతో తన దూకుడు కొనసాగించిన ఢిల్లీ జట్టు ప్రస్తుతం వరుసగా విఫలమవుతోంది. అందుకు భిన్నంగా హైదరాబాద్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ పట్టుదలతో కప్పు గెలవడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఇదిలాఉండగా, ఏ జట్టు ఫైనల్ వెళుతుందనే దానిపై క్రికెట్ అభిమానుల్లో చాలా అంచనాలే ఉన్నాయి.

Advertisement

Next Story