ఇవాళ నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్

by Shyam |
ఇవాళ నిజామాబాద్‌కు సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల మరణించగా.. మాక్లూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిర్వహించే ద్వాదశ దినకర్మలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం ప్రగతి భవన్‌ నుంచి ఇవాళ ఉదయం 10:30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో నిజామాబాద్‌ చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు మళ్లీ ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు.

Advertisement

Next Story