- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 55 కొత్త కరోనా కేసులు
దిశ, న్యూస్ బ్యూరో
తెలంగాణలో తాజాగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నిర్దారించబడిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడిన వారి సంఖ్య 1,509కు చేరుకుంది.శనివారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 44 మంది, 8 మంది వలస కూలీలు, సంగారెడ్డిలో ఇద్దరు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 కరోనా మరణాలు సంభవించాయి. నేడు 12 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 971కి చేరుకుంది. ప్రస్తుతం 504 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు.
గ్రేటర్‌లోనే అధిక ప్రభావం..
కరోనా సోకి అధికంగా ప్రభావితమైన కుటుంబాల జాబితాకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ప్రకటించింది. దీని ప్రకారం హైదరాబాద్ నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. కేవలం నగరంలోనే 168 కుటుంబాలు కరోనా వల్ల ప్రభావితమయ్యాయి.తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి -59, మేడ్చల్ -39, నిజామాబాద్- 30, వరంగల్ అర్భన్ -26 కుటుంబాలు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో నమోదైన పాజిటివ్ కేసుల్లో మాదన్నపేట పరిధిలో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న 23మంది కూడా ఉన్నారు.