కేంద్ర మంత్రులుగా 43 మంది ప్రమాణం

by Shamantha N |
PM Modi
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం విస్తరణలో భాగంగా కొత్త చేర్పులతోపాటు పోర్ట్‌ఫోలియో, ఇతర మార్పులూ జరుగుతున్నాయి. మొత్తంగా ఈ రోజు 43 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా బెర్త్ కన్ఫమ్ చేసుకున్నవారిలో బీజేపీ నేతలు నారాయణ్ రాణె, సర్బనందా సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, అజయ్ భట్, భూపేందర్ యాదవ్, శోభా కరండ్లజె, సునీతా దుగ్గల్, మీనాక్షి లేఖి, భారతి పవార్, శాంతాను ఠాకూర్, కపిల్ పాటిల్, మిత్రపక్షం జేడీయూ నుంచి ఆర్‌సీపీ సింగ్, ఎల్‌జేపీ నుంచి పశుపతి పరాస్, అప్నా దళ్ నుంచి అనుప్రియ పటేల్‌లున్నారు. వీరు మరికాసేపట్లో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర సహాయ మంత్రులు జీ కిశన్ రెడ్డి, పర్షోత్తమ్ రూపాలా, అనురాగ్ ఠాకూర్‌లకు ప్రమోషన్ వచ్చే అవకాశముందని సమాచారం. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్న 43 మంది మంత్రుల జాబితా ఇలా ఉన్నది.

1. నారాయణ్ రాణె
2. సర్బనంద సోనోవాల్
3. డాక్టర్ వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా
5. రామచంద్ర ప్రసాద్ సింగ్
6. అశ్విని వైష్ణవ్
7. పశుపతి కుమార్ పరాస్
8. కిరణ్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్
10. హర్దీప్ సింగ్ పురి
11. మన్సుక్ మాండవియా
12. భూపేందర్ యాదవ్
13. పర్షోత్తమ్ రూపాలా
14. కిశన్ రెడ్డి
15. అనురాగ్ సింగ్ ఠాకూర్
16. పంకజ్ చౌదరి
17. అనుప్రియా సింగ్ పటేల్
18. సత్యపాల్ సింగ్ బఘేల్
19. రాజీవ్ చంద్రశేఖర్
20. సుశ్రి శోభా కరండ్లజే
21. భానుప్రతాప్ సింగ్ వర్మ
22. దర్శన విక్రమ్ జర్దోశ్
23. మీనాక్షి లేఖి
24. అన్నపూర్ణ దేవి
25. ఏ నారాయణస్వామి
26. కౌశల్ కిశోర్
27. అజయ్ భట్
28. బీఎల్ వర్మ
29. అజయ్ కుమార్
30. చౌహాన్ దేవుసిన్హా
31. భగవంత్ ఖుబా
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్
33. ప్రతిమ భౌమిక్
34. సుభాశ్ సర్కార్
35. డాక్టర్ భాగవత్ కిషన్‌రావ్ కరద్
36. డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్
37. డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
38. భిశ్వేశ్వర్ తుడు
39. శాంతాను ఠాకూర్
40. డాక్టర్ ముంజపారా మహేంద్రభాయి
41. జాన్ బర్లా
42. డాక్టర్ ఎల్ మురుగన్
43. నిశిత్ ప్రమాణిక్

Advertisement

Next Story