రూ.50వేల విలువైన గుట్కా పట్టివేత

by Sumithra |
రూ.50వేల విలువైన గుట్కా పట్టివేత
X

దిశ, నిజామాబాద్:
ప్రభుత్వ నిషేధిత గుట్కాను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బోధన్ పట్టణంలోని ఇండియన్ కాన్ఫెక్షనరీ షాపులో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే..ఓ దుకాణంలో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా నిల్వలు ఉన్నట్టు టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐ నరేందర్ రెడ్డి అధ్వర్యంలో సిబ్బంది ఆ షాపులో తనిఖీలు చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన రూ.50 వేల విలువైన గుట్కాను పట్టుకున్నారు.అనంతరం దుకాణాదారుడిని అదుపులోకి తీసుకుని బోధన్ పట్టణ పోలీసులకు అప్పగించారు.వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story