- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కంటతడి పెట్టిస్తున్న టీఎన్ఆర్ చివరి మాటలు..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వలన ఎంతోమంది ఆత్మీయులను కోల్పోతున్నాం. సోమవారం ఉదయం ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నర్సింహరెడ్డి (TNR) కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మందితో ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ ఆర్’ పేరుతో ఇంటర్వ్యూలు చేసి ప్రేక్షకుల మనసులకు దగ్గరయ్యారు. టీఎన్ఆర్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ఇక తాజాగా టీఎన్ఆర్ చివరి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
కరోనా మహమ్మారి పై ప్రభుత్వం చేపట్టిన స్టే హోమ్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ కరోనాను ఎలా జయించవచ్చు..? ఇంట్లో ఉంటూ కరోనా నుండి ఎలా బయటపడాలి అనేది అభిమానులకు తెలిపారు. కరోనా వచ్చిందని భయపడకండి.. ఇలాంటి సమయంలో ప్రాణాయామం చాలా మేలు చేస్తుంది .. అందరు ఎక్కువ ప్రాణాయామం చేయండి.. అంటూ చెప్పారు. అంతేకాకుండా తానూ ఇంటిదగ్గర పుస్తకాలూ చదువుతూ, పిల్లలతో హ్యాపీగా ఉన్నానని, ఇలాంటి సమయాన్ని మీ పిల్లలతో హ్యాపీగా గడపడానికి వెచ్చించండి అంటూ తెలిపారు. కరోనా గురుంచి అన్ని జాగ్రత్తలు చెప్పి, అంత ఆరోగ్యంగా ఉన్న ఆయన ఒక్కసారిగా కరోనా తో చనిపోయారు అంటే ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ ఆయన అభిమానులు ఈ వీడియో ను షేర్ చేస్తున్నారు.