ఒలింపిక్స్ వెళ్లే అథ్లెట్లకు తమిళనాడు సీఎం బంపర్ ఆఫర్

by Shamantha N |
ఒలింపిక్స్ వెళ్లే అథ్లెట్లకు తమిళనాడు సీఎం బంపర్ ఆఫర్
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న అథ్లెట్లకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జులై 23న ప్రారంభం కానున్న ఒలింపిక్స్‌లో ఎవరైనా భారత క్రీడాకారులు స్వర్ణ పతకం గెలిస్తే రూ. 3 కోట్ల రూపాయల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇండియా నుంచి పలు క్రీడా విభాగాల్లో దాదాపు 100 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, హాకీ వంటి క్రీడల్లో చాలా మంది పాల్గొంటున్నారు. వీటిలో బ్యాడ్మింటన్, బాక్సింగ్ వంటి క్రీడల్లో పతకాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ముందుగానే నగదు బహుమతిని ప్రకటించి సీఎం స్టాలిన్ క్రీడాకారులను ఉత్సాహపరచడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 23న ప్రారంభం కానున్న విశ్వక్రీడల పరేడ్‌లో 2016 రజత పతాక విజేత పీవీ సింధు భారత పతాకాన్ని చేతపట్టి జట్టును నడిపించ నన్నది. సింధుతో పాటు సాయిప్రణీత్‌, అథ్లెట్ నీరజ్ చోప్రా, టీటీ ఆటగాడు ఆచంట శరత్ కమల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, బాక్సర్ అమిత్ పంఘాల్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed