అత్యాచార ఘటనలో రాజకీయ ఒత్తిళ్ళు సిగ్గుచేటు!

by Shyam |

తెలంగాణ జన సమితి నేత ఎం.నర్సయ్య

దిశ, హైదరాబాద్ :

హైదరాబాద్ నగరం నడిబొడ్డున చాదర్‌‌‌‌‌ఘాట్‌లో ఓ దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరగడాన్ని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.నర్సయ్య తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, తల్లిదండ్రులు లేని అనాథ మైనర్ బాలికకు వెంటనే న్యాయం చేయాలన్నారు. నిందితుడు షకీల్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పని చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండి కూడా ఓ ప్రజా ప్రతినిధి రౌడీలాగా వ్యవహరించి నిందితున్ని తీసుకెళ్లడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ప్రపంచమంతా విపత్కర పరిస్థితిలో ఉండగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. షకీల్ లాంటి మానవ మృగాలను కఠినంగా శిక్షించడమే ఏకైక మార్గమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags: Minor girl, Rape, TJS, Narsaiah, Chaderghat

Advertisement

Next Story