గ్రేటర్ బరిలో టీజేఎస్

by Shyam |
గ్రేటర్ బరిలో టీజేఎస్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు టీజేఎస్ ప్రకటించింది. జీహెచ్ఎంసీలోని 150డివిజన్లలో 50స్థానాల్లో పోటీ చేస్తామని, ఇప్పటికే 19మంది అభ్యర్థులు ఖరారయ్యారని టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు ఎం. నర్సయ్య స్పష్టం చేశారు. మిగతా స్థానాల్లో అభ్యర్థులను బట్టి స్వతంత్రులకు మద్దతు ఇస్తామని, పార్టీలకు అయితే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వెల్లడించారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించగా రేపటి నుంచి 20వ తేదీవరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అటు.. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేన ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశాయి.

Advertisement

Next Story