‘పంచనామ’కు సహకరించిన దిల్ రాజు

by Shyam |
panchanama
X

దిశ, సినిమా : హార్దిక్ క్రియేషన్స్ బ్యానర్‌పై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్‌ను తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్.. తన కథను నమ్మి సినిమా తీసేందుకు ముందుకొచ్చిన ప్రొడ్యూసర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వినూత్నమైన కథను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేలా వెన్నుతట్టి ప్రోత్సహించారని వెల్లడించారు. ఈ చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక నిర్మాతలు మాట్లాడుతూ.. కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా, ఉత్తమ నిర్మాణ విలువలతో జనరంజకంగా సినిమాను రూపొందించామన్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు. త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ్, ముక్కు అవినాష్ తదితరులు నటించిన చిత్రానికి పవన్ గుంటు సినిమాటోగ్రఫర్‌గా పనిచేయగా.. ప్రదీప్ చంద్ర సంగీతం అందించారు.

Advertisement

Next Story