తప్పుచేసిన ఎస్సై సస్పెన్షన్.. క్షమాపణలు చెప్పిన ఎస్పీ

by srinivas |   ( Updated:2021-06-21 22:49:04.0  )
తప్పుచేసిన ఎస్సై సస్పెన్షన్.. క్షమాపణలు చెప్పిన ఎస్పీ
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీసు స్టేషనుకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులకు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ వ్యవహారం ఏపీ పోలీస్ శాఖలో వెలుగుచూసింది. తన కూతురిని ఏడిపిస్తున్నారంటూ ఓ తల్లి తిరుపతి ఎంఆర్‌పల్లిలో పోలీసు స్టేషన్‌‌‌కు సోమవారం ఉదయం వచ్చింది. ఇదే సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ గిరిబాబు వారి ఫిర్యాదు స్వీకరించకపోగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధితులను స్టేషన్‌లో కూర్చోబెట్టారు. చివరకు ఫిర్యాదు తీసుకోవడం కుదరదని.. మా స్టేషన్‌ పరిధిలోకి రాదని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎస్పీ వద్దకు విషయాన్ని తీసుకెళ్లారు. ఎస్‌ఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతి అర్బన్ ఎస్పీ గిరిబాబును సస్పెండ్ చేశారు. అలాగే, సదరు బాధితులకు క్షమాపణలు చెప్పి.. నిందితులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed