శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే.?

by Hamsa |
శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే.?
X

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. సోమవారం స్వామివారిని 36,924 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారికి భక్తులు రూ.3.01 కోట్ల కానుకలు సమర్పించారు. తిరుమలేశుడిని 13,236 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా, నేడు తిరుమలలో కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Advertisement

Next Story