- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవనీత కృష్ణుడిగా శ్రీ మలయప్ప
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి తిరుమల ఆలయంలో శ్రీ మలయప్పస్వామి నవనీత కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వాహనసేవలో పాల్గొన్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది.
ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. ఉదయం మలయప్పస్వామి త్రివిక్రమ అలంకారంలో దర్శనమిచ్చారు. సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో కటాక్షించారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుడ్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం.
ఇంతటి మహాతేజోపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్స్వామి, తెలంగాణ హైకోర్టు జడ్జి అమర్నాద్ గౌడ్, ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి, నిశ్చిత, ప్రసాద్, గోవిందహరి, అనంత, సంపత్రవినారాయణ, సీవీఎస్వో గోపీనాథ్జెట్టి, అర్బన్ఎస్పీ రమేష్రెడ్డి, పేష్కార్జగన్మోహనాచార్యులు పాల్గొన్నారు.