టిక్‌టాక్ భారత్‌లో రీఎంట్రీ ఇస్తుందా?

by Shyam |
టిక్‌టాక్ భారత్‌లో రీఎంట్రీ ఇస్తుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రతా ప్రమాణాల దృష్ట్యా భారత్‌లో నిషేధించిన చైనా యాప్స్ లిస్టులో అత్యంత ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌, పబ్‌జీ కూడా ఉన్నాయి. అయితే పబ్‌జీ ఇండియాలో మళ్లీ మొదలుకాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టిక్‌టాక్ కూడా భారత్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ మేరకు టిక్‌‌టాక్ ఇండియా హెడ్ తమ ఉద్యోగులకు ఓ లేఖ రాయడంతో పాటు దివాళీ సందర్భంగా ‘మిస్ యూ ఇండియా’ అంటూ భారతీయ టిక్‌టాక్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

‘లోకల్ న్యూస్, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ రిక్వైర్‌మెంట్స్ ‌తదితర విషయాల్లో భార‌త ప్రభుత్వం అడిగిన అన్ని వివ‌రాల‌ను అందించామని, మ‌న‌మంద‌రం క‌లిసి యూజ‌ర్లకు, క్రియేట‌ర్లకు మ‌న ప్లాట్‌ఫామ్ ద్వారా మంచి గుర్తింపును ఇద్దామని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ లేఖలో తెలిపారు.

ఇక దీపావళీ సందర్భంగా.. ‘భారత్‌ను మిస్ అవుతున్న ప్రతిరోజూ ఒక దీపం వెలిగిస్తున్నాం’ అంటూ టిక్‌టాక్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. భారత్‌లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాచుర్యం పొందిన యాప్స్‌లో టిక్‌టాక్ ముందు వరసలో ఉంటుంది. నిషేధం కాకముందు ఈ ఒక్క ఏడాదిలోనే టిక్‌టాక్ 61.1 కోట్ల సార్లు డౌన్‌లోడ్ అయి రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా అయిన డౌన్‌లోడ్స్‌లో అది 30.3 శాతం కాగా, 2019లో అయిన డౌన్‌లోడ్‌లకు ఇది రెట్టింపు.

భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించడంతో ఆ కంపెనీ భారీ నష్టాలను చవిచూసింది. అటు అమెరికాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం విధించనున్నారు. పబ్‌జీ తిరిగి వస్తున్న నేపథ్యంలో టిక్‌టాక్ ఇండియా కూడా మళ్లీ ఇండియా మార్కెట్‌లో అడుగుపెట్టాలని భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప‌బ్‌జీ కొరియాకు చెందిన కంపెనీ కాగా, టిక్‌టాక్ చైనా కంపెనీ. ఈ కోణంలో ఆలోచిస్తే, టిక్‌టాక్ వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

tags : TikTok, Comeback, tiktok india, diwakli tweet, nikhil gandhi
slug : TikTok Ready for Comeback Next?
photo : tiktok

Advertisement

Next Story