- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tictok ఎత్తుగడ ఫలిస్తుందా!
దిశ, వెబ్ డెస్క్: గాల్వాన్ ఘటన నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59యాప్‌లపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్ ఓ కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. కంపెనీ హెడ్ క్వార్టర్‌ను చైనా నుంచి బ్రిటన్‌కు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది. ఏ దేశానికి మార్చాలనే అంశం పై లండన్ కూడా పరిశీలనలో ఉందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలసింది. మరోవైపు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఏడాది టిక్‌టాక్ కంపెనీ భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేపట్టింది. వాల్ట్ డిస్నీకి చెందిన కెవిన్ మేయర్‌ను టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించింది.
మరోవైపు అమెరికాలో కూడా టిక్‌టాక్ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోంటోంది. చైనాతో ట్రేడ్‌వార్ కారణంగా ఆ దేశానికి చెందిన కంపెనీల మీద అమెరికా కఠిన నిబంధనలు అమలుచేస్తోంది. గత కొన్ని వారాలుగా బైట్ డ్యాన్స్ కంపెనీ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి చైనాలో కాకుండా విదేశాల్లో టిక్‌టాక్ రాబోయే రోజుల్లో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేయబోతోందని, మరీ ముఖ్యంగా లండన్‌లో ఉద్యోగ కల్పన చేయనుందని తెలుస్తోంది.