కొత్త రికార్డు సృష్టించిన టిక్ టాక్

by Harish |
కొత్త రికార్డు సృష్టించిన టిక్ టాక్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. వారికి ఉన్న ప్రధాన టైంపాస్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్. టాలెంట్ చూపించుకోవాలనుకున్నా, వేరే వాళ్ల టాలెంట్ చూడాలన్నా అందరికీ ఒకే దారి టిక్ టాక్. ఈ యాప్ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ పాపులారిటీతో టిక్ టాక్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ డౌన్‌లోడ్‌లు కలిపి రెండు బిలియన్ డౌన్‌లోడ్‌లు దాటిపోయింది.

సెన్సార్ టవర్ వారి నివేదిక ప్రకారం ప్లేస్టోర్‌లో 1.5 బిలియన్ డౌన్‌లోడ్లు కాగా, యాప్ స్టోర్‌లో 495.2 మిలియన్ డౌన్‌లోడ్లు అయ్యాయి. అయితే ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో 315 మిలియన్ ఇన్‌స్టాల్స్ అవగా, ఇది యాప్ ఆవిష్కరించిన నాటి నుంచి అత్యధికం. ఇక ఈ రికార్డులో 30.3 శాతం భారతీయులదే. మన దేశం నుంచి మొత్తంగా 611 మిలియన్ మంది టిక్‌టాక్ డౌన్‌లోడ్ చేశారు. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో అమెరికా దేశాలు నిలిచాయి.

Tags – tik tok, 2 billion users, india, lockdown, biggest, download

Advertisement

Next Story

Most Viewed