మీరాబాయి ఇన్‌స్పిరేషన్.. 140 కిలోల బరువెత్తిన టైగర్ ష్రాఫ్

by Shyam |   ( Updated:2023-04-01 15:57:43.0  )
మీరాబాయి ఇన్‌స్పిరేషన్.. 140 కిలోల బరువెత్తిన టైగర్ ష్రాఫ్
X

దిశ, సినిమా : టోక్యో ఒలింపిక్స్ 2020 వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించడాన్ని దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం వెయిట్ లిఫ్టర్ చానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్ టైగర్ ష్రాఫ్.. స్ట్రాంగ్‌గా తయారయ్యేందుకు పరిమితులకు మించి కష్టపడేలా తనను ఇన్‌స్పైర్ చేసిన చానుకు తనదైన స్టైల్‌లో కృతజ్ఞతలు తెలిపాడు. స్క్వాట్స్ ప్రదర్శనలో భాగంగా తన భుజాలపై హెవీ వెయిట్స్ బ్యాలన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన టైగర్.. వాట్ ఏ పర్ఫార్మెన్స్! టీమిండియా ముందుకు వెళ్లు! అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోపై స్పందించిన తండ్రి జాకీ ష్రాఫ్.. కొడుకును బ్లెస్ చేస్తూ కామెంట్ చేశాడు. యాక్టర్ రితేష్ దేశ్‌ముఖ్ కూడా ‘నీలో నమ్మలేనంత శక్తి దాగుంది బ్రదర్’ అంటూ ప్రశంసించాడు. ఇక టైగర్ పోస్ట్‌కు స్పందించిన మీరాబాయి తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు థాంక్స్ చెప్పింది.

Advertisement

Next Story