- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బతుకమ్మ పూల కోసం వెళ్తే పులి ప్రత్యక్షం.. టెన్షన్‌లో గ్రామస్తులు
బతుకమ్మ పూల కోసం వెళ్తే పులి ప్రత్యక్షం.. టెన్షన్‌లో గ్రామస్తులు
by Aamani |
X
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని పాపంపేట గ్రామంలో పులి కదలికలు కనిపించాయి. పాపన్నపేట గ్రామానికి చెందిన దందేరా పెంటయ్య బతుకమ్మ పూల కోసం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లగా పెద్ద పులి కనిపించింది. ఈ క్రమంలో పెంటయ్య కంగారు పడి బతుకమ్మ పూలు ఏమో కానీ ప్రాణాలు పోతాయని.. గ్రామానికి పరుగులు తీశాడు. అనంతరం గ్రామస్తులకు సమాచారం అందించాడు.
దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు.. సర్పంచ్ బుజడి శేఖర్‌తో కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పులి పాదముద్రలు కనిపించడంతో భయానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు స్పందించి పులి నుండి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరారు.
Advertisement
Next Story