- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుపేదలకు టిఫిన్ అందజేత
దిశ, హైదరాబాద్ :
నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ 24 రోజులుగా అమల్లో ఉంది. అత్యవసరాలు తప్ప మిగతా వ్యవస్థలన్నీ బంద్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. వ్యాపారులు, ఉద్యోగులు తమకున్న వాటితో సర్దుబాటు చేసుకుంటున్నారు. రోజువారీ పనులతో బతుకు బండి నడుపుకునే పేదలు, నిరుపేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో కొందరు మానవతా వాదులు వారికి కలిగిన దాంట్లో కొంత వెచ్చించి అనాథలు, నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. రోజూ రోడ్లపై ఆహారం పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రాంనగర్ గుండు వద్ద అక్షయ కేటరర్స్ గత 20 రోజులుగా రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు దాదాపు 500 మందికి ఉచితంగా టిఫిన్ అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని చూసిన కొందరు స్థానికులు కూడా ఈ వితరణలో భాగస్వామ్యం అవుతున్నారు. రోజూ 5 గురు, లేదా 6 గురు కలిసి 500 మంది పేదలకు టిఫిన్ పెడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
Tags: tiffin distribution, orphan, people, lock down, covid 19 affect, humanity