ఆ యాప్‌లో చాట్, మీట్, డేట్.. అంతా ఒక్కరోజే!

by Sujitha Rachapalli |
ఆ యాప్‌లో చాట్, మీట్, డేట్.. అంతా ఒక్కరోజే!
X

దిశ, ఫీచర్స్ : లాక్‌డౌన్ కాలం నుంచి ‘డేటింగ్ యాప్స్’కు డిమాండ్ పెరగడంతో డౌన్‌లోడ్స్ సంఖ్య రెట్టింపు అయ్యింది. అయితే, ఈ యాప్స్‌లో డేట్ సెట్ చేసుకునేందుకు ముహుర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం వంటివేవీ చూసుకోవాల్సిన పని లేదు. టైమ్, రోజుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎంట్రీ ఇచ్చేయొచ్చు. కాగా డేటింగ్‌ను మరింత ఫన్‌ అండ్ ఎగ్జైటింగ్‌గా మార్చే ఉద్దేశ్యంతో ఓ ఆన్‌లైన్ డేటింగ్ యాప్.. వారంలో ఒకరోజు మాత్రమే యూజర్లకు ‘యాక్సెస్’ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఆ యాప్ ఏంటి? ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేయడానికి కారణమేంటి? తెలుసుకోండి..

ఏ వ్యాపారమైనా సరే.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటేనే సక్సెస్ సాధిస్తుంది. అలాంటిది వారానికి ఆరు రోజులపాటు వర్క్ చేయని ‘యాప్’ సక్సెస్ అవుతుందా? పైగా ‘టిండెర్ లేదా బంబుల్’ వంటి సక్సెస్‌ఫుల్ డేటింగ్ యాప్‌లతో పోటీపడగలదా? అంటే ‘థర్స్ డే’ యాప్ ఫౌండర్స్ మాత్రం అదే తమని మిగతా వారితో ప్రత్యేకంగా నిలబెడుతుందని చెబుతున్నారు. లండన్‌కు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలు జార్జ్ రావ్లింగ్స్, మాట్ మెక్‌నీల్ లవ్ ‘థర్స్ డే’ యాప్‌ను మే 6న మార్కెట్‌లో లాంచ్ చేయనున్నారు. అయితే లండన్, న్యూయార్క్‌లో ముందస్తుగానే 1,10,000 సింగిల్స్ రిజిస్టర్డ్ కావడం విశేషం.

‘ప్రజలు డేటింగ్ యాప్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది గొప్ప విషయం కాదు. ఒక్కడిగా ఉండటమే బోరింగ్ విషయం. అయితే ఇక్కడ ఎక్కువ టైమ్ వెచ్చించడంతో పాటు మనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకునే క్రమంలో ఒత్తిడి, విసుగు కూడా కలుగుతుంది. అందుకే ఆన్‌లైన్ డేటింగ్ నుంచి మీకు కావలసినవన్నీ ఒకే రోజులో జరిగిపోయే యాప్‌ను మేము డెవలప్ చేశాం. సెలెక్ట్ చేసుకోవడం, చాట్ చేయడం, కలవడం వంటివన్నీ గురువారం ఒక్కరోజులోనే పూర్తయిపోతాయి. ఇలా ఎందుకు అంటే? డేటింగ్ యాప్‌ల కంటే జీవితంలో విలువైనవి ఇంకా చాలా ఉన్నాయి. అందుకే ఈ యాప్‌‌ను కేవలం గురువారం మాత్రమే యాక్సెస్ చేయడానికి వీలు పడుతుంది’

వినియోగదారులు.. తమకు ఇష్టమైన వ్యక్తులతో చాట్, మీట్, డేట్ చేసేందుకు ‘థర్స్ డే’ యాప్ కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తుంది. ఒకవేళ గురువారం తాము విఫలమైతే, మళ్లీ మరోవారం ప్రయత్నించాల్సిందే. ఇది నెగెటివ్‌గా అనిపించవచ్చు, కానీ సాంప్రదాయ ఆన్‌లైన్ డేటింగ్‌కు చెక్ చెబుతూ, అంతులేని చిన్ని చిన్ని చాట్‌లను తగ్గిస్తూ, స్పాంటెనిటీని ప్రోత్సహించడానికి దీన్ని రూపొందించారు. కాగా డేటింగ్ కోసం వారానికి ఒక రోజు మాత్రమే కేటాయించడం వాస్తవానికి చాలా తెలివైనదని డేటింగ్ సృష్టికర్తలు అభిప్రాయపడుతున్నారు.

వారంలోని మిగతా ఆరు రోజులు డేటింగ్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇతర అనువర్తనాలు అద్భుతంగా ఉంటే వాటిని ఉపయోగించవద్దని తాము చెప్పడం లేదు. కానీ మీ నగరంలోని ప్రతీ వ్యక్తి గురువారం డేటింగ్ చేస్తున్నప్పుడు, ఆ రోజు మీరు డేట్ చేయడానికి ఫ్రీగా ఉంటే అదే ‘ది బెస్ట్ ఆప్షన్’ అని డెవలపర్స్ తెలిపారు.

Advertisement

Next Story