ఈ రాశి వారు జాగ్రత్త.. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వహించకండి

by Anukaran |
Panchangam
X

తేది : 12, ఆగష్టు 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చవితి
(నిన్న సాయంత్రం 4 గం॥ 52 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(నిన్న ఉదయం 9 గం॥ 32 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 8 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు సాయంత్రం 4 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు రాత్రి 6 గం॥ 30 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 52 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 25 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 4 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 31 ని॥ గంటలకు)

మేష రాశి: ఆశావాహ దృక్పథం ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దీర్ఘకాలంగా బాధపెడుతున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ తండ్రిగారి ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. కావలసినంత ధనం చేతికందుతుంది. అవసరాలకు ఖర్చు పెట్టుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

వృషభ రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం పట్టుదల అవసరం. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం దక్కాలంటే మరింత కష్టపడాలి. శీఘ్ర నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసు పనుల్లో నిర్లక్ష్యం వహించకండి. అధిక శ్రమ ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోండి ఆదాయం బాగున్నప్పటికీ అదనపు ఖర్చులు. ఒక శుభవార్త కుటుంబసభ్యుల లో ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారస్థులకు లాభాలు. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా శ్వాస సంబంధ రోగంతో బాధపడే వారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మిధున రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనం అవసరం. నిరాశావాదం వదిలిపెట్టండి లేకుంటే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. అనవసరపు దుబారా ఖర్చులను నివారించండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. ప్రేమికులు పెళ్లిపీటలు ఎక్కుతారు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వలన మానసిక అశాంతి. కుటుంబ సభ్యుల కొరకు కొంత సమయం కేటాయించండి వారితో గడపటం వలన మీకు ఎంతో ఎనర్జీ. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కర్కాటక రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. అనుకున్న కార్యాలను సాధించడం వలన అమితానందం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారి ప్రతిభను నిరూపించుకోవాలి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే మరింత శ్రమ పడాలి. మీ సామర్థ్యాన్ని వెలికి తీయండి అందరి ప్రశంసలు లభిస్తాయి. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి: రోజువారీ కార్యక్రమాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ రోజు. ఇతరులతో మాట్లాడేటప్పుడు పొరపాట్లు రాకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. కొంతమంది ఉద్యోగ మార్పు కై చేస్తున్న ప్రయత్నాలు సఫలం మంచి ఉద్యోగం లభిస్తుంది. మీ తోటి ఉద్యోగులు మీ మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు జాగ్రత్త. పెట్టుబడులను సరైన సలహా తీసుకొని పెట్టండి. ఈ రాశి స్త్రీలకు నీ భార్య భర్తలు పాత గొడవలు మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

కన్య రాశి: ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. మెడిటేషన్ ఒక మంచి ఉపాయం. మీ తెలివి తేటలను, సామర్థ్యాన్ని సమస్యలను అధిగమించడానికి ఉపయోగించండి. ఉద్యోగులకు శుభవార్త లు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు. నూతన పెట్టుబడులపై భాగస్వాములతో చర్చిస్తారు బహుమానాలు అందుకుంటారు. ఆడంబరాలకు పెడుతున్న ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

తులారాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే తెలివితేటలు సామర్థ్యము తప్పనిసరి. మీ నిరంకుశ ధోరణి మొండివైఖరి వలన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. వారితో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కొరకు సరైన ప్రణాళికలు వేయండి మీకు అన్ని మంచి రోజులు. ఆఫీస్ పనుల మీద శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తి చేయండి ఆదాయం బాగుంది అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోండి దానివలన మీ వైవాహిక జీవితం ఆనందంగా.

వృశ్చిక రాశి: ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి వాటికి కట్టుబడండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు తోటి ఉద్యోగులు మరియు పై అధికారులు ప్రశంశలు. కొంతమంది ఉద్యోగులకు ఆఫీస్ టూర్స్. వ్యాపారస్తులు పరిస్థితులకు తగినట్టు తెలివైన నిర్ణయాలు తీసుకోండి. అదనపు లాభాలను పొందుతారు. అనవసరపు విషయాలమీద సమయాన్ని వృధా చేయకండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మర్చిపోండి బంధాలను తెగే వరకు లాగకండి.

ధనుస్సు రాశి: మీ ఆత్మవిశ్వాసం అంబరాన్ని అంటుతుంది. తోటి ఉద్యోగులతో మీ సామరస్య ధోరణి వలన ఆఫీసులో ఆహ్లాదకర వాతావరణం. మీ పని సామర్ధ్యం పై అందరి ప్రశంసలు. వ్యాపారస్థులకు లాభాలు. వ్యాపారంలో ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు దూరమవుతాయి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆఫీసు పని మీద శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీల కు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి: మీ గమ్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. అడ్డంకులు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఎదుటి వారి మీద అసూయ పడకండి. దాని వల్ల మీకు లాభం లేకపోగా లేనిపోని అనారోగ్య సమస్యలు. కుటుంబ సభ్యులతో మనసువిప్పి మాట్లాడండి ముఖ్యంగా మీ తల్లితండ్రుల సలహా తీసుకోండి ఆఫీసులో తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. పనులు పెండింగ్ పెట్టకుండా సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి. అదనపు ఖర్చులు వలన డబ్బుకు ఇబ్బంది. అధిక శ్రమ వలన వెన్ను నొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక మంచి ఆనందకరమైన రోజు.

కుంభరాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే జాగ్రత్త, సహనం అవసరం. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. పెద్ద వారి సహాయ సహకారాలు లభిస్తాయి. వంశపారంపర్య స్థిరాస్తి విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మరింత సంపాదన కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఆఫీసులో తోటి ఉద్యోగుల, పై అధికారుల సహాయం లభించకపోవడంతో ఇబ్బందులు. ఎలర్జీ వల్ల దగ్గు జలుబు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి: మీ కోరికలను నెరవేర్చుకునే రోజు అనుకున్న కార్యాలను పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆఫీసులో పనులను సకాలంలో చాలా సులభంగా పూర్తి చేస్తారు. కొంతమంది ఉద్యోగం మార్పుకై చేస్తున్న ప్రయత్నాలు సఫలం. అవసరాలకు మించిన ధనం చేతికందుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

Advertisement

Next Story