గురువారం పంచాంగం, రాశిఫలాలు (13-05-2021)

by srinivas |   ( Updated:2021-05-12 10:35:50.0  )
గురువారం పంచాంగం, రాశిఫలాలు (13-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(ఈరోజు తెల్లవారు జాము 3 గం॥ 7 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారు జాము 5 గం॥ 39 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(ఈరోజు తెల్లవారు జాము 2 గం॥ 41 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారు జాము 5 గం॥ 45 ని॥ వరకు)
యోగము : అతిగండము
కరణం : బాలవ
వర్జ్యం : (రాత్రి 8 గం॥ 43 ని॥ నుంచి 10 గం॥ 31 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (నిన్న రాత్రి 11 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు తెల్లవారు జాము 1 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 10 గం॥ 2 ని॥ నుంచి 10 గం॥ 53 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 12 ని॥ నుంచి 4 గం॥ 3 ని॥ వరకు)
రాహుకాలం : (మధ్యాహ్నం 1 గం॥ 48 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 24 ని॥ వరకు)
గుళికకాలం : ( ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి 10 గం॥ 33 ని॥ వరకు)
యమగండం : ( ఉదయం 12 గం॥ 11 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 47 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : వృషభము

మేష రాశి : శుభ యోగాలు ఉన్నాయి. వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆస్తి వివాదాలు ఉండవచ్చు జాగ్రత్తపడండి. చేతికి అందాల్సిన డబ్బు అందక రుణాలు చేస్తారు. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వ్యాపారము తిరిగి కరోనా వల్ల దెబ్బతినవచ్చు. ఈ రాశి స్త్రీలకు ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను జాగ్రత్త పరచండి.

వృషభ రాశి : మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే వారి ఆరోగ్యం కొరకు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. నష్టం వస్తుందని భావించిన ఒక విషయంలో నష్టం జరగదు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. తోటి వారి వలన మేలు జరుగుతుంది ఈ రాశి స్త్రీలు ఆప్యాయతలకు అన్యోన్యతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

మిధున రాశి : వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించి వలసి వస్తుంది. మీకు లాభం గా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దానధర్మాలకు వినియోగించండి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి ఉత్సాహంగా పనిచేస్తారు ఈ రాశి స్త్రీలు తమ నోటి దురుసు తనం వలన రావలసిన ప్రయోజనాలను పోగొట్టుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి : మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం చక్కబడుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి స్త్రీలకు ఆఫీసులో కాని వ్యాపార ప్రదేశంలో గానీ మీరు ప్రయత్నిస్తున్న మార్పులు వెంటనే రాకపోవచ్చు సహనం పాటించండి.

సింహరాశి : స్వంత నిర్ణయాలతో ప్రారంభించిన పనులు నెరవేరతాయి. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలోని వ్యక్తుల వరకు సమయం వెచ్చించండి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధికి సంబంధించి మీరు పెడుతున్న ఖర్చు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ అంతరంగికులు మీ సమాచారాన్ని శత్రువులకు అందజేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు కరోనా వల్ల కొంత ఆరోగ్యం చికాకు పరుస్తుంది.

తులారాశి : ఎన్ని రోజులు పోరాటం చేసినా కొన్ని విషయాలలో ఫలితం దక్కదు అందుకని వివాదాలు పరిష్కరించుకోండి. ఆస్తులను అమ్మ కూడదని నిర్ణయించుకుంటారు. ఉద్యోగంలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. చెడు ఆలోచనలు మంచివికావు. ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి స్త్రీలకు మీరు కోరుకున్న ఉద్యోగం లభించడం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది.

కన్య రాశి : మిమ్ములను మీరు ప్రశాంతంగా ఉంచుకోండి సాధ్యమైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక ప్రసంగాల వల్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో కొత్త హోదా దక్కవచ్చు. అనుకోని ఖర్చులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి స్త్రీలకు సంతానము పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి : స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు చేయకండి. కరోనా వలన ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వ్యాపారం తిరిగి డీలా పడుతుంది. మీరు దాచిపెట్టుకున్న డబ్బు మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీరు సాధించిన ప్రగతి ఇతరులకు అసూయ కలిగించే విధంగా ఉంటుంది.

ధనుస్సు రాశి : ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి. ఉద్యోగంలో అధికారుల నుండి కొంత ఇబ్బంది ఎదురైనా అంతిమంగా విజయం ఉంటుంది. వ్యాపారంలో అంచనాలకు తగిన లాభాలు దక్కుతాయి. ఇంతకుముందు తీసుకున్న రుణాన్ని తిరిగి ఇవ్వకుండా మరల అడిగినవారికి నిర్మొహమాటంగా కుదరదు అని చెప్పండి. ఉద్యోగంలో బదిలీ కోరుకునే వారికి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ మనసులోని భావాలను ఇతరులకు తెలియ చేయటం వల్ల చాలామంది విరోధం అవుతారు.

మీన రాశి : ఆడంబరాల కోసం ధనవ్యయం చేస్తారు. మీ ఆఫీసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీ సహోద్యోగులు కొన్ని వస్తువులను దాచి పెట్టవచ్చు. ఆత్మీయులు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అందరినీ విపరీతంగా నమ్మకండి. మీ ఇష్ట దైవ ప్రార్థన మీకు ఎంతో మేలు చేస్తుంది. చాలా సందర్భాలలో ఉన్నదానితో తృప్తి పడతారు. ఈ రాశి స్త్రీలకు బంధువుల మధ్య స్నేహితుల మధ్య రాజీ కుదర్చడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభరాశి : మీ అతి ఉత్సాహం వలన రావలసిన లాభము అనుకున్నంతగా ఉండకపోవచ్చు. ఇంట బయట ఒత్తిడులు సమస్యలు పెరిగినా రానున్న కాలంలో అవి పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. జీవితంలో ముఖ్యమైన పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో సహోద్యోగులతో మంచి రిలేషన్స్ ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు కుటుంబంలో ఆఫీసులో, వ్యాపార ప్రదేశంలో ఎక్కడైనా మీదే అంతిమ నిర్ణయం.

మకర రాశి : ప్రేమ వివాహాలు ఫలించడానికి అవకాశం ఉంది. సంఘంలో మీకు పలుకుబడి గుర్తింపు మరియు మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి. అవాంతరాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు గతంలో ప్రయత్నించి ఫెయిల్ అయిన ఉద్యోగం కోసం తిరిగి ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ మనోధైర్యం మీ నిబ్బరము చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

Advertisement

Next Story