ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన చిప్స్, బిస్కెట్స్

by Sumithra |   ( Updated:2021-10-18 01:29:53.0  )
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన చిప్స్, బిస్కెట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : చిప్స్, బిస్కెట్స్ తిని ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతానికి చెందని నవీన్ కుమార్ సింగ్‌కు పారి, పిహు, విధి అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే వీరు దగ్గరిలోని ఓ దుకాణంలో చిప్స్ బిస్కెట్స్ కొనుక్కుని వారి ఇంటికి వెళ్లారు. అయితే అవి తిన్న తర్వాత ముగ్గురు తీవ్ర అస్వస్థకు గురికావడంతో వారిని తండ్రి నవీన్ కుమార్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో పారి, పిహూ మృతి చెందగా, చికిత్స పొందుతూ ఆదివారం విధి మృతి చెందింది. ఒక్క రోజు వ్యవధిలో ముగ్గురు కూతర్లు మరణిచడంతో ఆ తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారుల మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు తిన్న చిప్స్ బిస్కెట్లను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story