- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ హజారే ట్రోఫీలో కోవిడ్ కలకలం
దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ నిర్వహించే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కరోనా మహమ్మారి కలకలకం రేపింది. బయోబబుల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో.. ప్రతీ మూడు రోజులకు ఒకసారి ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారిన పడినట్లు బీసీసీఐ ధృవీకరించింది. బీహార్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడు కరోనా బారిన పడ్డారని, వారు ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
కరోనా బారిన పడిన ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బోర్డు వెల్లడించింది. గత వారం నిర్వహించిన పరీక్షల్లో బీహార్ ఆటగాడికి తప్ప మిగతా ఇద్దరికి నెగెటివ్ వచ్చింది. అయితే తాజాగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలు బీహార్ ఆటగాడు కూడా కరోనా బారిన పడ్డాడు. తర్వాత పరీక్ష నిర్వహించే వరకు ఈ ముగ్గురు ఇతర ఆటగాళ్లతో కలవకూడదని బీసీసీఐ ఆదేశించింది. కాగా, ఈ ముగ్గురి పేర్లను వెల్లడించడానికి బోర్డు నిరాకరించింది.