భ‌ద్రాద్రి జిల్లాలో ఘోరం

by Sumithra |
భ‌ద్రాద్రి జిల్లాలో ఘోరం
X

దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, మేన‌ల్లుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతు అప్పారావు తన కొడుకు తేజ్, మేనల్లుడు వినయ్‌తో క‌లిసి పొలం వ‌ద్ద‌కు వెళ్లాడు. తేజ్ సరదాగా పక్కనే ఉన్న రేపాక చెరువులోకి ఈత‌కు దిగాడు. అయితే కొంచెం లోతు ప్రాంతంలోకి తేజ్ వెళ్ల‌డంతో మునిగిపోయాడు. స‌మీపంలో ఉన్న తండ్రి.. కొడుకు నీళ్లలో మునిగిపోతుండ‌టాన్ని గ‌మ‌నించాడు. వెంటనే కొడుకును ర‌క్షించేందుకు వెళ్లిన అప్పారావు కూడా నీటిలో మునిగిపోయాడు. వీరిద్దరిని ర‌క్షించేందుకు య‌త్నించేందుకు నీళ్ల‌లోకి దిగిన విన‌య్‌ కూడా నీట మునిగి మృత్యువాత ప‌డ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు ప్ర‌మాదాన్ని గుర్తించి ర‌క్షించే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. చెరువులో గాలించి ముగ్గురి మృత‌దేహాల‌ను వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ‌ర‌ణించ‌డంతో కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు మిన్నంటాయి. గ్రామ‌స్థులంద‌రూ కంట‌త‌డిపెట్టారు.

Advertisement

Next Story