మూడు నెలల విద్యుత్ బిల్లు జారీ

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తి నిరోధానికి మార్చి నుంచి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఆగిపోయిన కరెంటు బిల్లుల జారీ తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ స్టార్ట్ కానుంది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్‌ఈఆర్సీ) ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మీటర్ల రీడింగ్ తీయనున్నారు. మార్చి నెల నుంచి మే దాకా మూడు నెలల విద్యుత్ వాడకం రీడింగ్ తీసి ఒక్కో నెలకు ఎంత మొత్తం చెల్లించాలనేది ప్రస్తుతం జూన్ నెలలో బిల్లు జారీ చేస్తారు. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు రూపొందించాయి. ఇప్పటికే విద్యుత్ పంపిణీ సంస్థలు గతేడాది వాడకం ప్రకారం పంపిన మార్చి, ఏప్రిల్ నెల ప్రొవిజనల్ బిల్లుల చెల్లించినవారికి ఆ మొత్తాన్ని మినహాయించి జూన్ నెలలో బిల్లు ఇవ్వనున్నారు. ఒకవేళ గడిచిన రెండు నెలలకు ప్రస్తుతం రీడింగ్ తీసినదానికన్నా ఎక్కువ చెల్లించి ఉంటే నెగెటివ్ బిల్లు, తక్కువ చెల్లించి ఉంటే పాజిటివ్ బిల్లు ఇవ్వనున్నారు. ఎక్కువ చెల్లించిన వాళ్లకు రాబోయే నెలల్లో వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఆ మొత్తాన్ని మినహాయించి జారీ చేస్తారు. వాస్తవ బిల్లులు జారీ చేయనున్న నేపథ్యంలో మీటర్ రీడర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, గ్లౌజులు, మాస్కులు ధరించడమే కాకుండా శానిటైజర్లు వాడుతారని ఎన్పీడీసీఎల్ ఎండీ అన్నమనేని‌గోపాల్ రావు ఒక ప్రకటనలో్ తెలిపారు.

Advertisement

Next Story