రెండేళ్లుగా వాట్సాప్‌లో ‘గుడ్ మార్నింగ్’ మెసేజెస్.. దాని వాల్యూ రూ.5 లక్షలకు పైమాటే..?

by Anukaran |
రెండేళ్లుగా వాట్సాప్‌లో ‘గుడ్ మార్నింగ్’ మెసేజెస్.. దాని వాల్యూ రూ.5 లక్షలకు పైమాటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ క్రమంగా అప్‌డేట్ అవుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మూడో కంటికి తెలియకుండా సైబర్ నేరస్థులు దాడులకు పాల్పడుతున్నారు. అందుకోసం ఎదుటివారి వీక్ నెస్‌ను ముందుగా కనిపెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 50 ఏళ్ల వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కుకుని.. డబ్బులు పోగొట్టుకుని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు రాజధాని గోవిందపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. 50 ఏళ్ల వ్యక్తికి రెండేళ్లుగా ఓ అజ్ఞాత వ్యక్తి అమ్మాయి లాగా వాట్సాప్‌లో ‘గుడ్ మార్నింగ్’ అని మెసేజెస్ చేస్తూ వచ్చాడు. మొత్తంగా రెండేళ్లలో 20 వరకు మెసేజెస్ వచ్చాయి. దీనికి బాధితుడు రిప్లై కూడా ఇచ్చాడు. ఓ రోజు కలుద్దామని ఇద్దరు మెసేజ్ చేసుకున్నారు. అయితే, అక్టోబర్ 8న ఆమె పంపించిన హోటల్ అడ్రస్‌కు బాధిత వ్యక్తి వెళ్లాడు. గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ అమ్మాయి లేకపోగా ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. అంతేకాకుండా ఇతన్ని డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిగా అనుమానించి దాడి చేసే ప్రయత్నం చేయబోయారు.

బలవంతంగా అతని వద్ద ఉన్న క్రెడిట్ కార్డ్స్, వ్యాలెట్ లాక్కుని.. ఫోన్ పాస్‌వర్డ్ కూడా తెలుసుకున్నారు. అనంతరం బాధిత వ్యక్తిని ఓ గదిలో బంధించి అక్కడ నుంచి ఆ ముగ్గురు పరారయ్యారు. ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకున్న బాధిత వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు ఐదు లావాదేవీల్లో తన ఖాతా నుంచి సుమారు రూ.3,91,812 నగదు బదిలీ అయ్యింది. ఆ తర్వాత మరో రూ.2 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించాడు.దీంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ పని సైబర్ నేరగాళ్ల పని పోలీసులు నిర్దారణకు వచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ మోసం చేశారని విచారణలో తేలింది.

Advertisement

Next Story