- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పాత బస్తీలో స్నేహితున్నే కడతేర్చిన కసాయి మూకలు
దిశ, చార్మినార్: అరువుగా తీసుకున్న డబ్బులు ఇస్తానని స్నేహితున్ని ఇంటికి పిలిచి అతికిరాతకంగా కత్తులతో హతమార్చిన తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను కాలాపత్తర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఘాజీబండకు చెందిన అబ్దుల్ సిద్దిక్(38) వద్ద నుంచి గత కొంత కాలం క్రితం వ్యాపార నిమిత్తం కాలాపత్తర్ కు చెందిన సాదిక్ బిన్ ఆలీ యమాని 8లక్షల రూపాయలు, హ్యాండ్లోన్ కింద కాలాపత్తర్ కు చెందిన సులేమాన్ఖాన్, షాలిబండాకు చెందిన మహ్మద్ సలీంఖురేషిలు 10వేల రూపాయలను అరువుగా తీసుకున్నారు.
తీసుకున్న డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్న సాదిక్ బిన్ ఆలీ యమాని, సులేమాన్ఖాన్, మహ్మద్ సలీంఖురేషిలను తన డబ్బులు తనకు ఇవ్వాలని అబ్దుల్ సిద్దిక్ తీవ్ర ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపధ్యంలో డబ్బుల విషయం మాట్లాడుదామని అబ్దుల్ సిద్దిక్ ను సాదిక్ బిన్ ఆలీ యమాని ఇంటికి పిలిచాడు. ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సులేమాన్ఖాన్, మహ్మద్ సలీంఖురేషిలతో కలిసి సాదిక్ బిన్ ఆలీ యమాని ఇంటికి వచ్చిన అబ్దుల్ సిద్దిక్ పై కొడవలి, ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతుని సోదరుడు అబ్దుల్ వహీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలాపత్తర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సాదిక్ బిన్ ఆలీ యమాని, సులేమాన్ఖాన్, మహ్మద్ సలీంఖురేషిలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును కాలాపత్తర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.