- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Viral Fever: గురుకుల పాఠశాలలో కలకలం.. 60 మందికి వైరల్ ఫీవర్
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతిలోని సత్యవేడులో ఉన్న ఓ గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఉన్నట్లుండి వైరల్ ఫీవర్ బారిన పడడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం బ్రేక్‌ఫస్ట్ తినడానికి వెళుతూ ఇద్దరు విద్యార్థులు కళ్లు తిరిగిపోడిపోగా.. పాఠశాల స్టాఫ్‌నర్స్ చెక్ చేసి జ్వరం తీవ్రంగా ఉందని గుర్తించారు. దీంతో మిగిలిన పిల్లలను కూడా టెస్ట్ చేయగా మొత్తం 60 మంది పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నారని తేలింది. వీరందరినీ హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే 6వ తరగతి చదువుతున్న శివశంకర్ అనే విద్యార్థికి జ్వరం ఎక్కువగా ఉండడంతో అతడిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే కలెక్టర్ వెంకటేశ్వర్, డీఎంహెచ్‌ఓ శ్రీహరి ఆసుపత్రికి చేరుకుని చిన్నారులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ స్కూలు ప్రిన్సిపల్, స్టాఫ్ నర్సుపై ఆగ్రహవం వ్యక్తం చేశారు.