- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GEN Z లవ్.. ప్రేమకు కొత్త అర్థం చెప్తున్న యువతరం
- లిమిటెడ్ రిలేషన్‌షిప్‌కే ప్రయారిటీ
- నో హార్డ్ ఫీలింగ్స్.. నో అటాచ్‌మెంట్స్
- ఒకరితో ఉంటూనే వేరొకరితో కనెక్షన్
- ఓన్లీ ఫిజికల్ ప్లెజర్‌కే మోస్ట్ ఇంపార్టెన్స్
- ఈగోలతో సిన్సియర్ ప్రేమకు సమాధి
‘నిజమే! ప్రేమ గురించి నాకేం తెలుసు. లైలా-మజ్నుకు తెలుసు, పారు-దేవదాసుకు తెలుసు.. ఆ తర్వాత తమకే తెలుసు..’ అని శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి చెప్పే ఈ డైలాగ్ గుర్తుందా? అయితే ఈ జెనరేషన్‌కి.. అంటే GEN Z జనరేషన్‌కి ప్రేమ గురించి ఎంత తెలుసో పక్కన పెడితే.. ప్రేమకు ప్రతిరూపంగా చిరంజీవి చెప్పిన లైలా-మజ్ను, పారు-దేవదాసులకు కూడా తెలీని ఎన్నో, ఎన్నెన్నో వెరైటీ లవ్ రిలేషన్‌షిప్స్ గురించి మాత్రం చాలా బాగా తెలుసు. ‘అదేంటి..? ప్రేమలో వెరైటీలేంటి..? అదేమైనా బిరియానీయా..? రకరకాల వెరైటీలో ఉండటానికి..’ అని మీరు డౌట్ పడుతుంటే వెంటనే ఈ ఆర్టికల్ చదివండి. ఎందుకంటే మీకు హోటల్లో ఇచ్చే మెనూ కార్డ్‌లో ఎన్ని బిరియానీ వెరైటీలు అవైలబుల్‌గా ఉంటాయో తెలీదు కానీ.. వాటికంటే ఎక్కువ వెరైటీలే మన జెన్ జీ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నాయి. 1997 నుంచి 2012 మధ్య కాలంలో పుట్టిన వాళ్లని జెన్-జీ కిడ్స్ అంటారు. సరిగ్గా టెక్నాలజీ విప్లవం మొదలైన తర్వాత పుట్టిన వీళ్లంతా మోడ్రన్ వరల్డ్‌కి చాలా అట్రాక్ట్ అవుతుంటారు. టెక్నికల్‌గా చాలా చురుగ్గా.. ఫ్యాషనబుల్‌గా ఉంటూ మోడ్రన్ లైఫ్ స్టైల్‌ని ఇష్టపడుతుంటారు. మరి జెన్-జీ అంటే ఎవరో తెలిసింది కదా.. ఇక ఇప్పుడు వాళ్లు ఫాలో అయ్యే వెరైటీ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయో చదవండి. - పోచరాజు కార్తికేయ
జెన్ జీ రిలేషన్‌షిప్స్:
సాధారణంగా ఒకప్పుడు ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటే వాళ్లిద్దరూ ఒకరికొకరు చాలా లాయల్‌గా, ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండేవాళ్లు.. అదే జెన్యూన్ రిలేషన్‌షిప్ అనిపించుకునేది. అలాంటి రిలేషన్‌నే అందరూ కోరుకునేవాళ్లు. కానీ ఇప్పుడున్న జెన్-జీ జెనరేషన్‌లో అలా కాదు.. రిలేషన్ పేరుతో ఒకరితో ఉంటూనే ఇంకొకరితో ట్రాక్ నడిపినా, ఒకేసారి ఇద్దరు, ముగ్గురితో రిలేషన్‌షిప్ మెయింటెయిన్ చేసినా.. లేదా ఎలాంటి ప్రేమ లేకుండా జస్ట్ ఫిజికల్ ప్లెజర్ కోసం కలిసి గడిపినా.. అన్నింటికీ ఓకే. ఇంకా మాట్లాడితే చాలామంది ఇలాంటి రిలేషన్‌షిప్స్‌కి అలవాటుపడి అసలు మాకు జెన్యూన్ రిలేషన్‌షిప్స్ అవసరమే లేదు.. మేము ఇలాగే హ్యాపీగా ఉన్నాం అన్నట్లు మాట్లాడుతుండడం అసలైన విచిత్రం. అంతేకాదు.. ఈ తరహా రిలేషన్స్‌కి ఈ జెన్-జీ కిడ్స్ విచిత్రమైన పేర్లు కూడా పెట్టుకున్నారు. అయితే వాటిలో టాప్-10 గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. వన్ నైట్ స్టాండ్:
ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరు అనుకోకుండా కలిసి ఓ రాత్రి శారీరక సుఖాన్ని అనుభవించి ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడమే వన్ నైట్ స్టాండ్.
2. హుక్ అప్:
ఇది కూడా వన్ నైట్ స్టాండ్ లాంటిదే. కానీ ఇందులో కేవలం రాత్రి మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఫిజికల్‌గా కలిసి ఆ తర్వాత తమ దారిన తాము వెళ్లిపోవచ్చు.
3. ఫ్లింగ్:
ఒకరి నుంచి ఒకరు ఎలాంటి సీరియస్ రిలేషన్‌షిప్ ఆశించకుండా కేవలం ఫిజికల్ మజా కోసం కలిసి ఉంటారు. ఇది ఏళ్ల తరబడి కూడా కొనసాగవచ్చు.
4. కఫింగ్:
కేవలం ఏడాదిలో కొంత సమయం అంటే నవంబర్ నుంచి మార్చి వరకు మాత్రమే ఫిజికల్ అవసరాల కోసం సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉండటాన్ని కఫింగ్ అంటారు.
5. ఫ్రెక్లింగ్:
ఇది కూడా కఫింగ్‌లాంటిదే. అయితే ఈ తరహా రిలేషన్‌షిప్ ఎండాకాలం అంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంటుంది.
6. బెంచింగ్:
ఓ వ్యక్తితో క్యాజువల్‌గా రిలేషన్‌లో ఉంటూ ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో అని వెతుకుతూ ఉండడాన్ని బెంచింగ్ అంటారు.
7. కుషనింగ్:
ఓ వ్యక్తితో సీరియస్ రిలేషన్‌షిప్ మెయిన్‌టేన్ చేస్తూనే వేరే బెటర్ ఆప్షన్స్ కోసం వెతుకుతూ ఉండటాన్ని కుషనింగ్ అంటారు. దీన్నే కూకీ జారింగ్ అని కూడా అంటారు.
8. బ్రెడ్ క్రంపింగ్:
పార్ట్‌నర్ తనని వదిలి వెళ్లకుండా కొంచెం అటెన్షన్ ఇస్తూ తన చుట్టూ తిప్పుకుంటూనే రిలేషన్‌షిప్‌ని ముందుకు వెళ్లనివ్వకుండా అలా హోల్డ్‌లో ఉంచడాన్ని బ్రెడ్ క్రంపింగ్ అంటారు.
9. సిచ్యుయేషన్‌షిప్:
సిచ్యుయేషన్స్ ఎఫెక్ట్ వల్ల ఒకరితో రిలేషన్‌లోఉండటాన్నే సిచ్యుయేషన్‌షిప్ అంటారు. పార్ట్‌నర్స్ ఇద్దరూ మానసికంగా, శారీరకంగా కూడా ఒక్కటైనా, ఇద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ ఉన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఉండటాన్ని సిచ్యుయేషన్‌షిప్ అంటారు.
10. ఘోస్టింగ్:
ఒకరితో సీరియస్ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ చూస్తూనే ఉన్నట్లుండి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా రిలేషన్‌షిప్‌ని కట్ చేసేసి మూవ్ ఆన్ అయిపోవడాన్ని ఘోస్టింగ్ అంటారు.
అయితే ఈ తరహా రిలేషన్స్ కరెక్టా? కాదా? అనే విషయం పక్కన పెడితే.. దీనివల్ల సమాజంలో అవసరాల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడడం తప్ప ఇష్టంతో, ప్రేమతో, అభిమానంతో తోడుగా నిలవడం అనే ఆలోచన నశించిపోతుందనేది కొంతమంది మానసిక నిపుణుల వాదన. ముఖ్యంగా ఒకప్పుడు ఒకరికోసం ఒకరు బతికినట్లు, తమకంటే తమ పార్ట్‌నర్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ అవ్వడం లాంటి బలమైన ఎమోషన్స్ మసకబారిపోతాయనేది వాళ్ల ఆందోళన.
అసలు ప్రేమంటే ఏంటి..?
మహాకవులు ఎవరూ ప్రత్యేకంగా చెప్పకపోయినా.. ప్రేమంటే త్యాగం, ప్రేమంటే అనురాగం, ప్రేమంటే.. ఒకరిని ఒకరు ఉండలేనంత బలమైన బంధం. ఏంటి అర్థం కావడం లేదా? అయితే మీకు అర్థమయ్యేలా సింపుల్‌గా చెప్తాను. ‘మన అవసరాలు, ఆలోచనలకంటే ఎక్కువగా మనం ప్రేమించిన వాళ్ల అవసరాలు, ఆలోచనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే ప్రేమంటే’. ‘మనం మనకంటే ఎక్కువగా ఎవరినైతే ఇష్టమపడతామో వారి కోసం ఏదైనా చేసేటప్పుడు మనకి బాధగా అనిపించదు. ఇంకా రెట్టింపు ఆనందం కలుగుతుంది. అదే ప్రేమంటే.’ అంటే మనల్ని మనం మర్చిపోయి వాళ్లే మనంగా జీవించడమే ప్రేమంటే. ఉదాహరణకి: మీరు కూడా చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఇది చూసే ఉంటారు. ఇంట్లో ఎప్పుడైనా మంచి కర్రీ చేసినప్పుడు, లేదా మీకిష్టమైన వంటకం వండినప్పుడు.. మీరు ఇంకా కావాలని అడిగితే.. మీ పేరెంట్స్, ముఖ్యంగా అమ్మ.. తను తినేది కూడా మీకిచ్చి.. మీరు తింటుంటే.. మీ వైపు ప్రేమగా చూస్తూ తన కడుపు నిండినంత ఆనందం పొందుతుంది. అది ప్రేమంటే.
ప్రేమకి ముఖ్యంగా కావల్సింది 5 లక్షణాలు:
1. అర్థం చేసుకుని సర్దుకుపోవడం
ఈ రోజుల్లో చాలా రిలేషన్స్ అలా మొదలై ఇలా ఎండ్ అయిపోతున్నాయి. సెలబ్రిటీలు సైతం ఏళ్ల తరబడి ఉన్న రిలేషన్స్‌ని ఎండ్ కార్డ్ వేసి విడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్ట్‌నర్స్‌లో ఉండే ఈగో, చీట్ చేయడం. నేనెందుకు తగ్గాలి? నేనెందుకు సర్దుకు పోవాలి? నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా..? అనే ఆలోచనలే. బట్.. ఎప్పుడైనా మీ అమ్మా, నాన్న మిమ్మల్ని తిడితే కోపం వచ్చినా, ఎంత ఇన్సల్టింగ్‌గా అనిపించినా వాళ్లని కాదని ఇంకో అమ్మా, నాన్నని తెచ్చుకోవాలని అనిపిస్తుందా..? అనిపించదు. సరిగ్గా అలాగే.. మనం ప్రేమించే అమ్మాయి కానీ, అబ్బాయి కానీ.. వాళ్లలో ఏదో క్వాలిటీ నచ్చలేదనో, వాళ్లు చేసిన ఏదో పని నచ్చలేదనో వాళ్లని రీప్లేస్ చేయాలనుకోవడం తప్పు. అలా మీకు అనిపించిందంటే ఒక్కటే అర్థం.. మీరు ప్రేమలో లేరు అని. ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకోవడం వల్ల రిలేషన్‌షిప్ తెగిపోతుందే తప్ప బలపడదు. అదే అందులో ఎవరైనా ఒకరు అవతలివారు అర్థం చేసుకునేవరకు సహనం పాటిస్తే ఆ రిలేషన్‌షిప్ కి ఎంతో గౌరవం ఇచ్చినట్టు అవుతంది. ఆ రిలేషన్‌షిప్ ఎప్పటికీ బలంగానే ఉంటుంది. కోపాలు, అర్థం లేని ఆవేశాలతో ఏ బంధం నిలబడదు.. భవిష్యత్తులో వారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
2. దాపరికాలు వద్దు
రిలేషన్‌షిప్‌లో ఒకరిని ఒకరు నమ్మాలి. నా మొబైల్ నా ప్రైవసీ, నా లాప్‌టాప్ నా ప్రైవసీ.. ఇలాంటి అడ్డగోలు ప్రైవసీ సర్కిల్స్‌లో బతుకుతున్నారు అంటే మీరిద్దరూ ఏదో అవసరం కొద్దీ ఒకచోట ఉంటున్నారే కానీ.. ప్రేమతో కాదు. కొంతమంది అంటుంటారు.. ‘నేను నా భర్త ఫోన్ ఎప్పుడూ చెక్ చేయను. నేను భార్య ఎంత సేపు కాల్స్ మాట్లాడినా పట్టించుకోను..’ అని గొప్పగా చెబుతుంటారు. బట్.. అది తప్పని నేను చెప్పను కానీ.. ఒకవేళ ఇద్దరు పార్ట్‌నర్స్‌లో ఎవరైనా అవతలి వారి మొబైల్ చెక్ చేసినా.. ల్యాప్‌టాప్ ఓపెన్ చేసినా..? ఎవరితో మాట్లాడుతున్నావ్..? ఎక్కడికెళ్లి వస్తున్నావ్..? ఎవరా పర్సన్..? అని అడిగినా.. అది ప్రైవసీకి భంగం కలిగిస్తున్నట్లు ఫీల్ అవకూడదు. అసలు వాళ్లు అడిగేకంటే ముందే ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకోవాలి. అంటే ఇద్దరి మధ్య ఎలాంటి బౌండరీస్ ఉండకూడదు.
3.చచ్చేవరకు ప్రేమిస్తూనే ఉండండి:
ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది అబ్బాయిలు పెళ్లైన తర్వాత భార్యతో రూడ్‌గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ల పిలుపులో ఎక్కడో ప్రేమ తగ్గినట్లనిపిస్తుంది. పెళ్లైన కొత్తలో పెళ్లాన్ని కౌగలించుకోనిదే పడుకోలేని భర్త.. పెళ్లాం పక్కనే పడుకున్నా అటు తిరిగి పడుకునే పరిస్థితికి చేరుకుంటుంది. ఇది బిహేవియర్ భర్తల్లో మాత్రమే కాదు.. భార్యల్లో కూడా కనిపిస్తుంది. ఒకవేళ భర్త సంపాదన తక్కువగా ఉన్నా.. లేదా ఫ్యామిలీ కొంచెం స్ట్రగుల్స్‌లో ఉన్నా.. భర్త ప్రేమగా దగ్గరకొచ్చినప్పుడు భార్యలు కూడా ‘మనకి ఇంక ఇదే తక్కువైంది.. అటు తిరిగి పడుకో..’ అంటూ దూరంగా నెట్టేస్తారు. ఇలాంటి ఘటనలు కూడా మన సొసైటీలో కోకొల్లలున్నాయి. అందుకే ఇద్దరి మధ్య ప్రేమ నిలబడాలంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులకంటే ఆ ప్రేమను ఓ మెట్టు పైన ఉంచండి. వాళ్లకి మీరే మోటివేషనల్ స్పీకర్, మీరే సపోర్టివ్ పిల్లర్, మీరే బలమైన షోల్డర్‌గా మారండి. ముఖ్యంగా సమస్యలన్నింటినీ మీ ప్రేమతో ఒక్కటై కలిసి ఎదుర్కోండి. అప్పుడు సమస్యలు తీరడమే కాదు.. మీ మధ్య ప్రేమ కూడా ఫెవికాల్ కంటే బలంగా, అంబుజా సిమెంట్ కంటే దృఢంగా మారుతుంది.
4. పక్కవాళ్ల సలహాలు పక్కనపెట్టేయండి
ఈనాటి లవ్ గురులు చాలామంది మ్యూచ్యువల్ రెస్పెక్ట్.. అనుమానపడితే ప్రేమ లేనట్లే, మీ సెల్ఫ్‌రెస్పెక్ట్ తగ్గించుకోవద్దు అని గొప్ప గొప్ప సలహాలు ఇస్తుంటారు. బట్.. ఇదంతా మోడ్రన్ ప్రేమకి మాత్రమే. ఒరిజినల్ ప్రేమకి ఇవేమీ పనిచేయవు. మ్యూచ్యువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడానికి ఇదేమైనా బిజినెస్ డీలా..? ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ అయితేనే.. ఒకరినొకరు బూతులు తిట్టుకోకుండా ఉండలేరు. ఎంతంమందిలో ఉన్నా ఒకరినొకరు పరమ దారుణంగా ఇన్సల్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్లు మ్యూచ్యువల్ రెస్పెక్ట్ గురించి ఎప్పుడూ ఆలోచించరు. అలాంటిది ఫ్రెండ్‌షిప్‌కి పీక్ పాయింట్ అయిన లవ్‌లో మాత్రం ఈ మ్యూట్యువల్ రెస్పెక్ట్ ఎందుకుండాలి..?
5. అవసరాల కోసం వద్దు..
కొంతమంది విచిత్రంగా వాళ్ల అవసరాల కోసం మాత్రమే రిలేషన్‌లో ఉంటారు. ఆ అవసరాలు తీరగానే సింపుల్‌గా రిలేషన్‌ని కట్చేసి వెళ్లిపోతారు. ఇది నమ్మకద్రోహమే. మిమ్మల్ని నమ్మి మీ కష్టాలని, సమస్యలని తనవేనని ఫీల్ అయి మీకోసం కష్టపడిన పార్ట్‌నర్‌ని అలా మోసం చేయకండి. కనీసం మోసం చేయాలనే ఆలోచన కూడా మనసులో రానివ్వకండి.
మరి అసలైన ప్రేమకి.. ఈ జెనరేషన్ మోడ్రన్ ప్రేమలకి ఉన్న తేడా అర్థమైంది కదా! అలా అని ఈ జెనరేషన్‌లో అసలు ప్రేమనేదే లేదా అంటే.. ఉంది. కచ్చితంగా ఒకరంటే ఒకరు చచ్చేటంతలా ప్రేమించుకునే పార్ట్‌నర్స్ కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ల సంఖ్య రాను రాను లిమిటెడ్ అయిపోతోంది. ప్రేమలో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకరు లాయల్టీని బ్రేక్ చేస్తున్న ఘటనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి. కాబట్టి.. ప్రేమను ప్రేమగా ప్రేమించండి. ప్రేమను అనుభవించండి. ఆ అనుభూతిని ఆనందించండి. అంతేకానీ.. ప్రేమించిన వారిని ఆడుకుని, వాడుకుని ఆ తర్వాత మోసం చేసి వదిలేయకండి.