CM Revanth Reddy : ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-15 05:25:53.0  )
CM Revanth Reddy : ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఫిఫా(FIFA) ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఇండియా వర్సెస్ మలేషియాల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, స్పోర్ట్స్ అథార్టీ చైర్మన్ కె.శివసేనారెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు.

అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ధృడ సంకల్పంతో ఉన్నారన్నారు. గచ్చిబౌలి కాంప్లెక్స్ లోని స్పోర్ట్స్ విలేజ్ టవర్స్ ను తిరిగి స్పోర్ట్స్ అథార్టీకి అప్పగించారని, నూతన క్రీడా పాలసీ రూపకల్పన, స్పోర్ట్స్ యూనివర్సటీ ఏర్పాటుకు చర్చలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఫుట్ బాల్ క్రీడపై ఆసక్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇండియా వర్సెస్ మలేషియాల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed