Champions Trophy-2025: ఐసీసీకి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ.. పాకిస్తాన్‌కు వెళ్లబోమని లేఖ

by Shiva |
Champions Trophy-2025: ఐసీసీకి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ.. పాకిస్తాన్‌కు వెళ్లబోమని లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ (Pakistan) హోస్ట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy-2025)కి సమయం దగ్గర పడుతోన్న వేళ ఐసీసీ (ICC)కి బీసీసీఐ (BCCI) బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగబోయే మెగా ఈవెంట్‌కు తాము పాకిస్థాన్ (Pakistan) వెళ్లబోమంటూ ఐసీసీ(ICC)కి బీసీసీఐ (BCCI) లేఖ రాసింది. అయితే, అదే విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) ధృవీకరించి అక్కడ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ పరిణామంతో ఛాంపియన్స్ ట్రోఫీ (Champion Trophy) నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌ (Pakistan) ఆర్థిక సంక్షభంలో కొట్టుమిట్టాడుతోంది. ఐసీసీ (ICC) మెగా ఈవెంట్‌ నిర్వహణతో అయినా తమకు ఆర్థికంగా లాభం చేకూరుతోందనే భావనలో అక్కడి ప్రభుత్వం ఉంది.

ఈ క్రమంలో ఎలాగైనా ఛాంపియన్స్ టోర్నీ (Champion Trophy)ని నిర్వహించాలని పాకిస్థాన్ (Pakistan) ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా, బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC)కి రాసిన లేఖతో పాక్ మళ్లీ ఇరకాటంలో పడినట్లైంది. దురదృష్టవశాత్తు ఒకవేళ ఈవెంట్‌ నుంచి పాక్ తప్పుకుంటే ఐసీసీ నుంచి వచ్చే ఆతిథ్య ఫీజు రూ.548 కోట్లు వారికి అందకుండా పోతాయి. ఈ క్రమంలోనే ఆసియా కప్ మాదిరిగానే హైబ్రిడ్ మోడల్‌ (Hybrid Model)లో భారత్ ఆడే వేదికలను తప్పక మార్చాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయ్యేలా కనిపిస్తు్న్నాయి. అదేవిధంగా పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలో జట్టును అక్కడికి పంపేందుకు ఆందోళన చెందుతున్నామని బీసీసీఐ (BCCI), ఐసీసీ (ICC)కి రాసిన లేఖలో పేర్కొంది.

కాగా, 2008లో చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) కెప్టెన్సీలో ఆసియా కప్‌ (Asia Cup) సందర్భంగా పాక్ వెళ్లిన భారత జట్టు మళ్లీ ఆ దేశానికి వెళ్లలేదు. 2012-13, 2016లో టీ20 ప్రపంచకప్, గతేడాది 50 ఓవర్ల ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ జట్టు (Pakistan Team) భారత్‌లో పర్యటించింది.

Advertisement

Next Story

Most Viewed