- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నందమూరి బాలకృష్ణ మూవీ టైటిల్ ఫిక్స్.. ఆ విషయాన్ని తెలియజేస్తూ టీజర్.. హైప్ పెంచేస్తోన్న బాలయ్య డైలాగ్
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రం ‘NBK 109’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై నాగవంశి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్య మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దర్శనమివ్వడంతో అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ సినిమా టైటిల్‌తో పాటు మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం టైటిల్ ఫిక్స్ అయింది. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘NBK109’ టైటిల్ నేమ్‌ను తెలుపుతూ టీజర్ విడుదల చేశారు. కాగా ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే పేరు ఖరారు చేస్తూ.. టీజర్ విడుదల చేసింది.
ఇక టీజర్‌ను పరిశీలించినట్లయితే.. “ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమ ధర్మ రాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది” అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. అలాగే గుర్తుపట్టావా ‘డాకు మహారాజ్’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్, విజువల్స్ గూస్ బమ్స్ తెప్పిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టీజర్‌ను చూసేయండి.