లైట్ వేయగానే పేలిన గ్యాస్ సిలిండర్.. ఏం జరిగిందంటే..?

by Sumithra |   ( Updated:2021-09-24 11:50:36.0  )
లైట్ వేయగానే పేలిన గ్యాస్ సిలిండర్.. ఏం జరిగిందంటే..?
X

దిశ, పటాన్‌చెరు: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి తీవ్రగాయాలు అయిన సంఘటన పటాన్‌చెరు పట్టణం గోకుల్‌నగర్‌లో చోటు చేసుకుంది. పటాన్‌చెరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకుల్‌నగర్‌కు చెందిన నాగభూషణం కుమారుడు సాయిచరణ్ శుక్రవారం సాయంత్రం ఇంటికొచ్చాడు. డోర్ తెరవగానే ఒక్కసారిగా గ్యాస్ వాసన రావడంతోనే లైట్ వేయగా.. ఒక్కసారిగా సిలిండర్ పేలింది.

ఈ ప్రమాదంలో సాయి చరణ్‌‌తో పాటు పైన నివాసముంటున్న ప్రవీణ్ కూడా తీవ్రంగా గాయపడగా, పక్క గదిలో నివాసముంటున్న శ్యామల అనే మహిళ స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు స్థానికుల సహకారంతో వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాద సంఘటన తెలుసుకున్న పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.

Advertisement

Next Story