- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు ముగ్గురు ఇండియా రావొద్దు..
దిశ, స్పోర్ట్స్ : సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా వన్డే, టీ20 సిరీస్‌లను ముగించుకున్నది. ఇక నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ మాత్రమే మిగిలింది. దీంతో టెస్టు జట్టులో స్థానంలేని క్రికెటర్లు ఇండియాకు తిరిగి వచ్చేశారు. శిఖర్ ధావన్, యజువేంద్ర చాహల్, హార్దిక్ పాండ్యా, దీపర్ చాహర్ ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారు. వీరితో పాటు ముగ్గురు బౌలర్లు కూడా ఇండియాకు తిరిగి రావల్సి ఉంది. కానీ బీసీసీఐ ఆదేశాల మేరకు టి. నటరాజన్, శార్దుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్ ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. వీరు ముగ్గురు టెస్టు జట్టులో సభ్యలు కాదు. ఇందులో నటరాజన్ కేవలం నెట్ బౌలర్‌గానే ఆసీస్ వెళ్లి అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించాడు. అంతే కాకుండా నటరాజన్ వన్డే, టీ20లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఠాకూర్, సుందర్ కూడా బంతితో రాణించారు. దీంతో వీరిని నెట్స్‌లో ప్రాక్టీస్ బౌలర్లుగా అక్కడే ఉంచారా లేదా టెస్టు జట్టులో తీసుకునే అవకాశం ఉందా అనే సందిగ్దత నెలకొన్నది.