విహహానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. అంతలోనే

by Sumithra |   ( Updated:2021-08-28 04:20:24.0  )
విహహానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. అంతలోనే
X

దిశ,మునుగోడు: పెళ్లికి వెళ్లి వస్తున్న ముగ్గురు స్నేహితులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీ గూడెం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి‌కి చెందిన హరీష్ (22)రామంతపూర్‌కు చెందిన సల్మాన్(23), ఆసిఫ్(21)లు హరీష్ స్వగ్రామంలో వివాహానికి హాజరై శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ బయలుదేరారు. ద్విచక్రవాహనంపై బయలుదేరిన ముగ్గురు యువకులు చౌటుప్పల్ మండల పరిధిలోని ధర్మాజీగూడెం స్టేజి వద్దకు రాగానే వే బ్రిడ్జి వద్ద రివర్స్ చేస్తున్న లారీ‌ని వెనకనుండి బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా హైద‌రాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా ప‌నిచేస్తున్నట్లు సమాచారం. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ ఎన్. శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Next Story