- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో కారు బీభత్సం…
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో శనివారం కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ అతి వేగం కారణంగా ముగ్గురు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిశాయి. భీంగల్ సీఐ సైదయ్య కథనం ప్రకారం … భీంగల్ మండలం నుంచి వస్తున్న కారు.. బడా భీంగల్ వద్ధ బైక్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటా హుటిన ఆర్మూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మిగిలిన వారిని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా అసుపత్రికి తరలించారు
అక్కడ చికిత్స పొందుతు మరో వ్యక్తి మృతి చెందారు. మృతులను జల్ల భూమన్న (48) భూదేవి(70) చిన్న రాజన్న (70)లుగా గుర్తించారు. కాగా ఈ కారు ప్రమాద దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రమాదానికి 10 సెకన్ల ముందు హోటల్ ఎదుట ఇద్దరు చిన్నపిల్లలు ఆటలు ఆడారు. 10 సెకండ్లలో వారు అక్కడి నుండి పక్కకు వెళ్లడంతో చిన్నపిల్లకు ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మద్యం సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి అయింది. ఈ మేరకు భీంగల్ పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.