బెంగళూరులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

by Anukaran |
బెంగళూరులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : బెంగళూరులోని చామరాజపేటలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం శ్రీ మహాకాళీ అమ్మాన్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీ గోదాంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

వివరాల ప్రకారం.. గోదాంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పని చేస్తున్న మనోహర్ సహా మరో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story