యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

by Sridhar Babu |   ( Updated:2021-08-17 05:43:30.0  )
యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల నేపథ్యంలో హోమాదులు నిర్వహించేందుకు బాలాలయంలో యాగశాలను ఏర్పాటు చేశారు. ఏడాది పాటు ఆలయంలో పూజల్లో, భక్తుల నుంచి తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలను చెరిగిపోయేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా సుదర్శన, నారసింహ హోమం, కల్యాణం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.

Advertisement

Next Story