ముగ్గురు బైక్ దొంగలు అరెస్టు

by Aamani |
ముగ్గురు బైక్ దొంగలు అరెస్టు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో ముగ్గురు బైక్ దోంగలను పట్టుకోని వారివద్ధ 23 బైక్ లను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎసిపి వేంకటేశ్వర్లు తెలిపారు. అదివారం నగరంలోని నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎసిపి కథనం ప్రకారం… వినాయక నగర్ లో అదివారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒక ఆటోలో పల్సర్ మోటార్ సైకిల్ ను పెట్టి ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. అనుమానంతో ఆటోని ఆపి విచారించగా.. కొర్రల గంగాధర్, గంగా, షేక్ అబ్దుల్ రహమాన్, అస్లాం ఖాన్ పఠాన్ ఇంకా సోహెల్, చోటూ అనే నలుగురు కలిసి చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. నలుగురు కలిసి నిజామాబాద్ నగరంలోని డిచ్పల్లి, మామిడిపల్లి ,నగర శివారు ప్రాంతాలలో రాత్రి పూట ఆటోలో వెళ్లి ఇంటి ముందు పార్క్ చేసిన మోటర్ సైకిళ్ళను గుర్తించి మొత్తం 23 మోటార్ సైకిళ్ళను దొంగిలించి వాటిని ఎవరికీ అనుమానం రాకుండా తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకుందామని అనుకున్నారని తెలిపారు.

అదివారం వారు దొంగిలించిన మోటార్ సైకిళ్లలో నుండి ఒక మోటార్ సైకిల్ ను రహమాన్ ఆటోలో తీసుకెళ్ళి కామారెడ్డిలో అమ్ముదామనుకుని పోలీసులకు దొరికిపోయారు. మోటార్ సైకిళ్లకు సంబంధించి నిజామాబాదు 4వ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, 3 వ పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, 2 వ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, 6 పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, రూరల్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు, నిర్మల్ పోలీస్ స్టేషన్ లో 1, 1 వ పోలీస్ స్టేషన్ నందు 1 కలిపి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story